LIC క్రెడిట్ కార్డులు ఉచితంగా పొందొచ్చు తెలుసా? రూ.5 లక్షల బెనిఫిట్ పొందండిలా?

యావత్ దేశంలోనే బీమా రంగ సంస్థలలో ఒక్కటిగా పేరు గాంచిన LIC (లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) తన కస్టమర్లకు క్రెడిట్ కార్డులు అందిస్తోన్న సంగతి మీకు తెలుసా? మీకు LICలో ఒక్క భీమా అయినా వుండే ఉంటుంది కదా.అలాంటప్పుడు వినియోగించుకోవడంలో తప్పేముంది? అయితే LIC నేరుగా కాకుండా ఇతర బ్యాంకులతో భాగస్వామ్యం ద్వారా క్రెడిట్ కార్డులను ఆఫర్ చేయడం గమనార్హం.యాక్సిస్ బ్యాంక్, IDBI బ్యాంక్ వంటి వాటితో LIC భాగస్వామ్యం కుదుర్చుకుంది.వీటి ద్వారా కోబ్రాండెడ్ క్రెడిట్ కార్డులను అందిస్తోంది.

 Lic Offering Multiple Benefits On Premium Payment And Reward Points-TeluguStop.com

కాగా LIC అందిస్తున్న ఈ క్రెడిట్ కార్డుల ద్వారా మీరు అనేక రకాల ప్రయోజనాలు పొందవచ్చని భోగట్టా.కాగా ఇవి పూర్తిగా ఉచితం.

వాటిని పొందటానికి మీరు ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.అలాగే కాంప్లిమెంటరీ పాయింట్లు కూడా పొందే వీలుంది.

అంతేకాకుండా ప్రీమియం మొత్తాన్ని ఈ కార్డు ద్వారా చెల్లిస్తే.రివార్డు పాయింట్లు కూడా పొందొచ్చు.

ఇకపోతే, యాక్సిస్ బ్యాంక్ భాగస్వామ్యంతో LIC 3 రకాల కార్డులను అందుబాటులో ఉంచింది.అవి ఒకటి LIC సిగ్నేచర్ క్రెడిట్ కార్డు , రెండు LIC ప్లాటినం క్రెడిట్ కార్డు, మూడు LIC టైటానియం క్రెడిట్ కార్డు.

Telugu Lic Credit, Liccredit, Lic Offers, Lic Signature-Latest News - Telugu

LIC సిగ్నేచర్ క్రెడిట్ కార్డుపై రూ.100 మీరు ఖర్చు చేసినట్లయితే 2 రివార్డు పాయింట్లు వస్తాయి.అలాగే రూ.5 లక్షల పర్సనల్ రోడ్ యాక్సిడెంట్ కవరేజీ, రూ.కోటి ఎయిర్ యాక్సిడెంట్ కవర్, 1 శాతం ఫ్యూయెల్ సర్‌చార్జ్ మాఫీ, లాంజ్ ఫెసిలిటీ వంటి బెనిఫిట్స్ అనేకం ఉన్నాయని గుర్తుపెట్టుకోవాలి.ఇక LIC ప్లాటినం క్రెడిట్ కార్డు గురించి ఒకసారి చూస్తే… రూ.100 ఖర్చుపై ఇక్కడ 2 రివార్డు పాయింట్లు పొందవచ్చు.రూ.3 లక్షల వరకు పర్సనల్ యాక్సిడెంట్ కవరేజ్, రూ.కోటి వరకు ఎయిర్ యాక్సిడెంట్ కవరేజ్, ఫ్యూయెల్ సర్ చార్జ్ మాఫీ వంటి బెనిఫిట్స్ అనేవి ఉన్నాయి.అదే టైటానియం క్రెడిట్ కార్డులో అయితే పైన పేర్కొన్న కార్డులపై ఉన్న అన్ని బెనిఫిట్స్ ఉన్నాయి.కాబట్టి వీటిలో మీకు ఏది నచ్చినా మంచి బెనిఫిట్స్ పొందొచ్చని నిపుణుల మాట.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube