నిత్యం మన ఇళ్లల్లో కావచ్చు, ఆరు బయట కావచ్చు… ఎవరు పలకరించినా పలకరించకపోయినా ఈగలు ప్రతీ ఒక్కరినీ పలకరిస్తూ ఉంటాయి.కానీ నిత్యం మనకు కనిపించే ఈగలు గురించి తెలిసినదే తక్కువే అని చెప్పకోవాలి.
ఈగలో ఎన్నో రహస్యాలు దాగి వున్నాయి.ఏకంగా ఈగ అనే కథావస్తువుపైన సినిమా తీసిన రాజమౌళి కూడా ఈగలు గురించి ఈ విషయాలు చెప్పలేడేమో? అవును, ఈ భూమిపై ఈగలు లేని ప్రదేశాలు లేవు.అవి వాలని చోటే ఈ భూమ్మీద లేదని చెప్పుకోవాలి.
మనలో చాలామంది పలు ఇన్ఫెక్షన్లకు కారణం అవుతాయని వాటిని తరిమేస్తూ వుంటారు.
ఐతే.ప్రకృతిలో ఈగలు కీలక పాత్ర పోషిస్తున్నాయి అని గుర్తించరు.మొక్కలకు పువ్వులు, కాయలూ వచ్చేలా చేస్తాయి, సేంద్రియ పదార్థాలు మొక్కలకు అందేలా చేస్తాయి, ఇతర పురుగులకు ఈగలు ఆహారం అవుతాయని మీకు తెలుసా? ఈగలు అత్యంత త్వరగా వృద్ధి చెందుతాయి.ఒక్కో ఈగ 4 రోజుల్లో 500 గుడ్లు వరకు పెడుతుంది.
కేవలం వారం రోజుల్లో అవి ఈగలుగా మారుతాయి.ఒక్కో ఈగ 25 రోజులు మాత్రమే బతకగలదు.
చెత్త, వ్యర్థాలు, కుళ్లిన ప్రాణులే ఈగలు ఆవాసాలు.తద్వారా వాటికి వ్యాధులను తెచ్చే సూక్ష్మక్రిములు అంటుకుంటాయి.అలాంటి ఈగలు మనపై వాలినప్పుడు ఆ వ్యాధులు మనకి కూడా సోకగలవు.ఇలా ఈగలు 65 రకాల వ్యాధుల్ని వ్యాపింపజెయ్యగలవు అని ఓ సర్వే. డయేరియా, కలరా, టైపాయిడ్, కుష్టు, ఆంత్రాక్స్, క్షయ ఇలా అలా వ్యాప్తి చెందినవే.ఈగలు ఆహారాన్ని నమలలేవని మీకు తెలుసా? అవి ఎంజైములను పదార్థాలపై ఉమ్మడం ద్వారా ఆ పదార్థాలు ద్రవంగా మారతాయి.ఆ ద్రవాన్ని ఈగలు స్వీకరిస్తాయి.