ప్రపంచవ్యాప్తంగా భయానక సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి.ఒకపక్క కరోనా వైరస్ విలయతాండవం చేస్తుంటే మరోపక్క యుద్ధాలు ప్రపంచ పాలకులకు నిద్ర లేకుండా చేస్తూ ఉన్నాయి.
ఇలాంటి తరుణంలో దక్షిణ కొరియా దేశ రాజధాని సీయోల్ లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.గ్వాచియెన్ నగరంలో ఓ సొరంగం గుండా వెళ్తున్న బస్సు మరియు ట్రక్కు ఢీ కొన్నాయి.
ఈ దుర్ఘటనలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి.
ప్రమాదంలో ఆరుగురు ప్రాణాలు కోల్పోగా 37 మంది తీవ్ర గాయాలు పాలయ్యారు.
వీరిలో ముగ్గురు పరిస్థితి చాలా విషమంగా ఉన్నట్లు సమాచారం.ఈ క్రమంలో 50 ఫైర్ ఇంజన్ లు.140 మంది సిబ్బంది రంగంలోకి దిగి మంటలను అదుపు చేయడం జరిగింది.మంటలు ఘోరంగా వ్యాపించడంతో దాదాపు 55 వాహనాలు అగ్నికి ఆహుతి అయ్యాయి.
సొరంగంలో ఈ ప్రమాదం చోటు చేసుకోవడంతో… మొత్తం పొగ కమ్మేసింది. సొరంగంలో ఉన్న వాహనాదారులు ఊపిరాడక తీవ్ర ఇబ్బందులతో పరిగెత్తాల్సి వచ్చింది.దీంతో మంటలను అదుపు చేయడానికి అగ్ని మాపక సిబ్బంది అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు.