Mehaboob dil swetha naidu : seబిగ్ బాస్ మెహబూబ్ కు స్టేజ్ పై ఘోర అవమానం.. ఏం పీకావంటూ పరువు తీస్తూ?

తెలుగు బుల్లితెర పై ఈ మధ్యకాలంలో ఎంటర్టైన్మెంట్ షోల సంఖ్య అంతకు అంతకు పెరిగిపోతోంది.చాలా షోలు జబర్దస్త్ షోని బీట్ చేయాలని చూస్తున్నప్పటికీ ఆ సోలో సగభాగం రేటింగ్స్ ని కూడా అందుకోలేకపోతున్నాయి.

 Swetha Naidu Made Hilarious Punches On Mehaboob Dil Se Swetha Naidu, Mehaboob D-TeluguStop.com

బుల్లితెర ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడం కోసం కొత్త కొత్త కార్యక్రమాలు పుట్టుకొస్తూనే ఉన్నాయి.ఈటీవీ, స్టార్ మా, జీ తెలుగు ఇలా పలు రకాల చానల్స్ లో అనేక రకాల కామెడీ షో లను మొదలు పెడుతున్నారు.

ఈ నేపథ్యంలోనే తాజాగా మొదలైన టీవీ షోలలో లేడీస్ అండ్ జెంటిల్మెన్ షో కూడా ఒకటి.ఈ షోకి ప్రదీప్ హోస్ట్ గా వ్యవరిస్తున్నాడు.

ఇందులో సీరియల్ ఆర్టిస్టులు, కపుల్స్, సోషల్ మీడియాలో పాపులర్ అయినవారు జంటలుగా పాల్గొంటుంటారు.

ప్రతి ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు ఈ ప్రోగ్రాం ప్రసారం కానుంది.

వచ్చే ఆదివారం ఎపిసోడ్ కి సంబంధించి కొత్త ప్రోమో రిలీజ్ చేశారు షో నిర్వాహకులు.ఇందుకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

కాగా ఈ ప్రోమోలో కొన్ని జంటల ఇంట్రడక్షన్ ఆద్యంతం ఆకట్టుకున్నాయి.ఇక వచ్చే జంటల పై యాంకర్ పంచులు వేస్తూ కడుపుబ్బా నవ్వించాడు.

ఈ క్రమంలోనే ఇందులో భాగంగా సోషల్ మీడియా ద్వారా పాపులర్ అయిన మెహబూబ్ దిల్ సే శ్వేతా నాయుడు, సిద్ధూ – సోనియా సింగ్, యాంకర్ స్రవంతి చొక్కారపు – ప్రశాంత్ జంటలుగా పాల్గొన్నారు.

ఇక ఇందులో ముందుగా ఎంట్రీ ఇచ్చిన మెహబూబ్ – శ్వేతా.కేజీఎఫ్ 2 సినిమాలో మెహబూబా సాంగ్ కి డాన్స్ చేశారు.అయితే.డాన్స్ అయిపోయిన తరువాత శ్వేతా మెహబూబ్ దగ్గరికి వచ్చి.ఏం పీకావని కంగ్రాట్స్ చెప్పడానికి.అని అంది.ఆ తర్వాత దిల్ సే అంటే ఇంటిపేరు అనుకున్నాను అని పంచులు వేసి పరువు తీసింది.

అప్పుడు శ్వేతా మెహబూబ్ పై వరసగా పంచులు వేస్తూ అతని పరువు తీసింది.ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube