ఓపెన్ వర్క్ పర్మిట్ వున్న వారి జీవిత భాగస్వాములకు కెనడా ప్రభుత్వం శుభవార్త చెప్పింది.ఈ తరహా పర్మిట్ వున్న వారి జీవిత భాగస్వాములు 2023 నుంచి దేశంలో వర్క్ పర్మిట్ పొందడానికి అర్హులని ప్రకటించింది.
ఈ నిర్ణయం వల్ల కెనడాలో పెద్ద సంఖ్యలో స్థిరపడిన భారతీయులకు మేలు కలగనుంది.ఓపెన్ వర్క్ పర్మిట్ అనేది విదేశీ పౌరులు కెనడాలోని ఏదైనా యజమాని / ఏదైనా ఉద్యోగంలో చట్టబద్ధంగా పనిచేయడానికి అనుమతిస్తుంది.
శుక్రవారం కెనడా ఇమ్మిగ్రేషన్, శరణార్ధులు, పౌరసత్వ శాఖ మంత్రి సీన్ ఫ్రేజర్ మాట్లాడుతూ.తాము ఈరోజు చేసిన ప్రకటన యజమానులకు కార్మికులను కనుగొనడానికి, కుటుంబాలతో కలిసి వుండటానికి దోహదపడుతుందన్నారు.
దాదాపు 2,00,000 మంది వలసదారులకు తమ నిర్ణయం వల్ల లబ్ధి కలుగుతుందని ఫ్రేజర్ తెలిపారు.కొత్త పాలసీ ద్వారా 1,00,000కు పైగా జీవిత భాగస్వాములను కెనడా లేబర్ ఫోర్స్‌లోని వివిధ ఖాళీల్లో భర్తీ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.
కొత్త పాలసీని మూడు దశాల్లో అమలు చేస్తామని ఫ్రేజర్ చెబుతున్నారు.తొలి దశలో తాత్కాలిక విదేశీ వర్కర్ ప్రోగ్రామ్, ఇంటర్నేషనల్ మొబిలిటీ ప్రోగ్రామ్, పోస్ట్ గ్రాడ్యుయేట్ వర్క్ ప్రోగ్రామ్‌లకు అధిక వేతనాలు పొందే వ్యక్తులు వుంటారు.
ఇది వచ్చే సంవత్సరం ప్రారంభమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.రెండవ దశలో తక్కువ వేతన స్ట్రీమ్ కింద వున్న వ్యక్తులకు అవకాశం కల్పిస్తారు.కెనడియన్ ప్రావిన్సులు, దేశంలోని ఇతర భూ భాగాలతో అవకాశం కల్పిస్తారు.
సంప్రదింపుల తర్వాత ఈ దశ ప్రారంభమయ్యే అవకాశాలు వున్నాయి.మూడవ దశలో వ్యవసాయ కార్మికుల కుటుంబాలకు
ఆ దేశ అధికారిక గణాంకాల ప్రకారం.ఈ ఏడాది మూడవ త్రైమాసికంలో 9,12,600 ఉద్యోగాలు ఖాళీగా వున్నాయట.
కరోనా కారణంగానే కెనడాలో ఈ పరిస్ధితి ఎదురైనట్లుగా తెలుస్తోంది.హెల్త్ కేర్, కన్‌స్ట్రక్షన్, అకామిడేషన్ అండ్ ఫుడ్, రిటేల్ ట్రేడ్, మాన్యుఫ్యాక్చరింగ్ రంగాల్లో ఖాళీలు పెరుగుతున్నాయి.
ఈ నేపథ్యంలో దేశ ఆర్థిక వృద్ధి కోసం కెనడా ప్రభుత్వం భారీ స్థాయిలో ఇమ్మిగ్రేషన్ విధానాలను సడలిస్తూ వస్తోంది.దీనిలో భాగంగా ఇప్పటికే దేశంలో స్థిరపడిన విదేశీయులకు కెనడా పౌరసత్వం ఇవ్వాలని జస్టిన్ ట్రూడో సర్కార్ నిర్ణయించింది.