మన దేశవ్యాప్తంగా ఎన్నో పురాతనమైన ఆచారాలు, సంప్రదాయాలు చాలామంది ప్రజలు ప్రతి రోజు పాటిస్తూనే ఉంటారు.అంటే సంవత్సరానికి ఒకసారి అయ్యప్ప స్వామి మాల ధరించి అయ్యప్ప స్వామి దర్శనానికి వెళుతుంటారు.ఆ మాల ధరించినప్పుడు రోజు రెండు పూటలా చల్ల నీటితో స్నానం చేసి నేలపై నిద్ర పోవడం, చెడు మాటలు మాట్లాడకుండా ఎప్పుడూ స్వామి నామస్మరణం చేసుకుంటూ ఉంటారు.41 రోజులు అత్యంత నిష్టతో కొనసాగే ఈ అయ్యప్ప దీక్ష కార్తీక మాసం మొదలు మకర సంక్రాంతి వరకు అయ్యప్ప దీక్షల కోలాహలం ఉంటుంది.అయ్యప్ప పూజలో ప్రధానమైన విషయం శరణు ఘోష.నవ వీధి భక్తి మార్గాలలో శరణగతి సత్వర పలితాన్నిస్తుందని వేద పండితులు చెబుతారు.శరణగతి వీడిన భక్తులు బాగోగులను స్వయంగా దేవుడే చూసుకుంటారని భక్తుల విశ్వాసం.ఇప్పుడు ఇరుముడి వెనుకున్న అర్ధాన్ని తెలుసుకుందాం.మండల దీక్ష పూర్తయిన తర్వాత శబరిమలలో కొలువైన అయ్యప్ప స్వామికి ఇరుముడి కట్టుకొని దర్శించుకోవడానికి భక్తులు బయలుదేరుతారు.ఇరుముడి అంటే రెండు మూడు ల కలది అని అర్థం.
భక్తిశ్రద్ధలను సాధనలతో పొందగలిగితే స్వామి అనుగ్రహం లభించి వారి దీక్ష సఫలమవుతుందని నమ్ముతారు.ఇరుముడి ఒక భాగంలో దేవుడికి సంబంధించిన సామాగ్రిని ఉంచుతారు.రెండో భాగంలో నీళ్లు తొలగించిన కొబ్బరికాయలో ఆవు నెయ్యిని నింపి ఉంచుతారు.ఈ నేతితో స్వామివారికి అభిషేకం చేస్తూ ఉంటారు.ఇరుముడితో శబరిమల ఆలయంలోని 18 మెట్ల ఎక్కి అయ్యప్ప స్వామిని దర్శించుకుంటారు.అయ్యప్ప ను కనులారా దర్శించుకుని పుణ్యక్షేత్రాల మీదుగా తిరిగి వారి ఇంటికీ చేరుకుంటారు.
ఈ దీక్షలో 18 మెట్లు ఎక్కి స్వామిని చూడడం అంటే మామూలు విషయం కాదు.ఒక్కొక్క మెట్టుపై మనలోని చెడు అలవాట్లను వదులుకుంటూ స్వామి దగ్గరికి చేరాలి.
దీక్ష విరమించిన తర్వాత మళ్లీ పాత చెడు అలవాట్లను వదలకపోతే ఆ దీక్ష చేసి అర్థమే ఉండదు.దీక్షలో నేర్చుకున్న మంచి విషయాలను అలాగే నలుగురితో చెప్పుకుంటూ మనం కూడా పాటించడం వల్ల దేవుని అనుగ్రహం మనపై ఎప్పుడూ ఉంటుంది.
DEVOTIONAL