మన దేశవ్యాప్తంగా ఎన్నో పురాతనమైన దేవాలయాలు ఉన్నాయి.ఆ దేవాలయాలలో అప్పుడప్పుడు కొన్ని అద్భుతమైన సంఘటనలు జరుగుతూ ఉంటాయి.
ప్రస్తుతం అలాంటి అద్భుతమైన ఒక సంఘటనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పశ్చిమగోదావరి జిల్లాలో జరిగింది.ఇలాంటివన్నీ దేవుడి శక్తి మహిమలే అని భక్తులు నమ్ముతారు.
అంతేకాకుండా ప్రత్యేక పూజలు కూడా చేస్తూ ఉంటారు.ఈ మధ్యకాలంలో ఇలాంటి సంఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయి.
విగ్రహం పాలు తాగడం, పాము శివుడికి పూజ చేయడం, ఆవు గుడి దగ్గర ప్రదక్షిణలు చేయడం, హనుమంతుడు కళ్ళు తెరవడం, కొబ్బరికాయ గణపతి రూపంలో ఉండడం, రాముడు కన్నీరు కార్చడం ఇలా ఎన్నో అద్భుతమైన సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి.
చాలాసార్లు వీటి గురించి వింటూనే ఉన్నాం.
కానీ దీనికి గల కారణాలు ఏంటి అనేది మాత్రం ఇప్పటివరకు తెలియదు.ఇలాంటి ఘటనలు ఒక మిస్టరీగానే మిగిలిపోతున్నాయి.
ఎందుకంటే హిందువుల్లో ఎక్కువమంది దేవుళ్లకు మహిమలు ఉన్నాయని చాలామంది భక్తులు గట్టిగా నమ్ముతారు వారిని నమ్మకాలను నిజమే అనే విధంగా ఇలాంటి సంఘటనలు నిజం చేస్తున్నాయి.ప్రస్తుతం పవిత్రమైన కార్తిక మాసంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా లో ఒక అద్భుతమైన సంఘటన జరిగింది.
కడియం మండలం కడియాపు లంక చింతలోని అమ్మవారి విగ్రహం కళ్ళు తెరిచి భక్తులను చూడడం వల్ల ఆ దేవాలయానికి భక్తుల రద్దీ భారీగా పెరిగిపోయింది.సాధారణంగా దేవత విగ్రహాలు కన్నుమూసి ఉన్నట్లుగా సగం మాత్రమే తెరిచి ఉన్నట్లుగా, చాలా విగ్రహాలను గుడికి వెళ్ళినప్పుడు చూసే ఉంటారు.కానీ ఇక్కడ అమ్మవారి కళ్ళు సడన్గా తెరవడం ఇదంతా దేవి మహిమే అని అక్కడి భక్తులు చెబుతున్నారు.ఇదిలా ఉండగా ప్రస్తుతం కార్తీకమాసం చివరి కార్తిక సోమవారం కావడంతో ఆలయానికి భక్తులు ఎక్కువగా వచ్చారు.
ఈ క్రమంలో కడియపులంకలోని లక్ష్మీదేవి ఆలయంలో మహాలక్ష్మి అమ్మవారు కళ్ళు తెరిచి ఉండడం చాలామంది భక్తులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.