మన దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న చాలా దేశాల నుండి ప్రజలు వాస్తు శాస్త్రాన్ని నమ్ముతారు.ప్రజలు చాలామంది ఇల్లు నిర్మించుకోవాలనుకుంటే ఆ ఇంటిని ఖచ్చితమైన వాస్తుతో నిర్మించుకోవాలని వాస్తు నిపుణులను సంప్రదిస్తుంటారు.
ఇంకా చెప్పాలంటే ఇల్లు నిర్మించే దగ్గర నుంచి ఇంట్లో ఏ దిశలో ఏ వస్తువును ఉంచాలో అని కచ్చితంగా వాస్తు ప్రకారమే చేస్తుంటారు.ఇలా వారి ఇంటిని వాస్తు ప్రకారం నిర్మించుకొని ఇంట్లో వస్తువులు వాస్తు ప్రకారం ఉంచుకోవడం వల్ల ఇంట్లో ప్రతికూల శక్తులు ఉండవని చాలామంది నమ్ముతారు.
మన ఇళ్లలో కొన్ని విగ్రహాలను వాస్తు ప్రకారం ఆ దిశలో ఉంచుకోవడం వల్ల ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది.ఇలా ఇంట్లో ఉంచే కొన్ని విగ్రహాల వల్ల ఆ ఇంట్లోకి అదృష్ట దేవతలు వస్తారని చాలామంది ప్రజలు నమ్ముతారు.
చాలామంది ప్రజలు వారి ఇళ్లలో గజరాజు విగ్రహాలను చూడచక్కగా ఏదో ఒక చోట భద్రంగా ఉంచుకుంటూ ఉంటారు.ఏనుగు విగ్రహం సంపదకు, ఐశ్వర్యానికి గుర్తుగా భావిస్తారు.ఏనుగు విగ్రహాలను ఇంట్లో ఎంచుకోవడం వల్ల ఆకర్షణగా కనిపించడమే కాకుండా ఇంట్లో సానుకూల దృక్పథం ఏర్పడుతుంది.పడక గదిలో ఏనుగు విగ్రహాలను ఉంచుకోవడం వల్ల వైవాహిక జీవితంలో ఏలాంటి ఇబ్బందులు రావు.
ఇంట్లో గుర్రం విగ్రహం ఉండడం వలన కూడా ప్రతి పనిలో విజయం లభిస్తుంది.ఇంకా చెప్పాలంటే ఇంట్లో గుర్రపు విగ్రహాన్ని ఉత్తర దిశలో ఉంచడం ఎంతో మంచిది.హంస విగ్రహాలు చూడడానికి ఎంతో అందంగా ఆకర్షణంగా ఉంటాయి.ఈ విగ్రహాలను మన ఇంట్లో ఉన్న నైరుతి దిశలో ఉంచడం వల్ల ఆ ఇంట్లో మీ కుటుంబ సభ్యులందరూ సంతోషంగా ఉంటారు.
సాధారణంగా తాబేలు విగ్రహాన్ని సంపదకు గుర్తుగా చాలామంది ప్రజలు నమ్ముతారు.ఇంట్లో, కార్యాలయాల్లో, షాపులలో తూర్పు, ఉత్తర దిశలలో తాబేలు విగ్రహాన్ని ఉంచడం వల్ల ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి వస్తుంది.
DEVOTIONAL