T20 వరల్డ్ కప్ టోర్నీలో ఇండియా సెమీఫైనల్ లో ఓడిపోవడం తెలిసిందే.ఇంగ్లాండ్ చేతిలో చిత్తూ చిత్తుగా ఓడిపోయింది.
అయితే ఈ టోర్నీలో కెప్టెన్ గా ఉన్న రోహిత్ శర్మ ఆడిన ఇన్నింగ్స్ ఒకటి కూడా లేదు.దీంతో టీంలో సీనియర్స్ ఆటగాళ్లపై తీవ్ర స్థాయిలో ఒత్తిడి వస్తుంది.T20 మ్యాచ్ లకి సీనియర్స్ నీ పక్కన పెట్టి కుర్రాళ్లకు అవకాశాలు ఇవ్వాలని చాలామంది మాజీ ప్రముఖ ఆటగాళ్లు కామెంట్లు చేస్తున్న సంగతి తెలిసిందే.ఇదిలా ఉంటే మాజీ ఆటగాడు వసీం జాఫర్… రోహిత్ శర్మపై కీలక వ్యాఖ్యలు చేశారు.
వచ్చే టి20 వరల్డ్ కప్ లో రోహిత్ శర్మ ఆడే అవకాశాలు కనిపించడం లేదని పేర్కొన్నారు.టీం ఎంపికలో చాలామంది ప్లేయర్లు ఉంటే గందరగోళం ఏర్పడుతుందని అన్నారు.
ఈ T20 వరల్డ్ కప్ ఎంపికలో ఈ తప్పే జరిగిందని స్పష్టం చేశారు.ఈ టోర్నీ మొత్తంగా రోహిత్ కేవలం 116 పరుగులు మాత్రమే చేశారని జాఫర్ కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది.
ఇక ఇదే సమయంలో చాలామంది మాజీ ఆటగాళ్లు జట్టులో కుర్రాళ్లకు అవకాశం కల్పించాలని…T20 ఓటమి తర్వాత కోరుతున్నారు.