'బ్రహ్మాస్త్ర 2'లో కేజిఎఫ్ స్టార్.. ఈ వార్తపై క్లారిటీ వచ్చేసింది!

ఇటీవలే బాలీవుడ్ నుండి మరొక పెద్ద సినిమాగా బ్రహ్మాస్త్ర రిలీజ్ అయ్యింది.అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో రణబీర్ కపూర్ హీరోగా అలియా భట్ హీరోయిన్ గా నటించారు.

 Kgf Fame Yash To Play 'dev' In Brahmastra 2, Alia Bhatt, Hero Yash, Brahmastra 2-TeluguStop.com

బాలీవుడ్ బ్యూటీ మౌని రాయ్ విలన్ గా కనిపించింది.అలాగే అమితాబ్ బచ్చన్, నాగార్జున కీలక పాత్రల్లో నటించారు.

అయితే ఈ సినిమా మూడు పార్టులుగా వస్తుంది అని ముందుగానే ప్రకటించిన విషయం తెలిసిందే.

అందుకే చెప్పినట్టుగానే మొదటి పార్ట్ పూర్తి అవడంతో ఈ సినిమా రిజల్ట్ తో సంబంధం లేకుండా సెకండ్ పార్ట్ తెరకెక్కించడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.

ఈ సినిమా పార్ట్ 1 భారీ ఓపెనింగ్స్ అందుకుంది.ప్లాప్ టాక్ వచ్చినా 200 కోట్ల క్లబ్ లోకి చేరి అందరిని ఆశ్చర్య పరిచింది.

అయితే బ్రేక్ ఈవెన్ అవ్వక పోవడంతో నష్టాలు అయితే తప్పలేదు.ఇది భారీ బడ్జెట్ తో రావడంతో చాలానే నష్టాలు వచ్చినట్టు తెలుస్తుంది.

Telugu Alia Bhatt, Bollywood, Brahmastra, Brahmastra Dev, Yash, Karan Johar, Kgf

ఏది ఏమైనా మేకర్స్ మాత్రం వెనక్కి తగ్గకుండా రెండవ పార్ట్ ను నిర్మించడానికి రెడీ అయ్యారు.బ్రహ్మాస్త్ర – శివ్ పేరుతొ తెరకెక్కిన మొదటి పార్ట్ 400 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించాడు డైరెక్టర్.ఇక ఇప్పుడు బ్రహ్మాస్త్ర – దేవ్ కోసం సన్నాహాలు జరుగుతున్నాయి.మరి దీనికి కొనసాగింపుగా చేస్తున్న ఈ సీక్వెల్ లో ఇప్పటికే చాలా మంది బిగ్ స్టార్స్ పేర్లు వినిపిస్తున్నాయి.

ఈ క్రమంలోనే తాజాగా మరో స్టార్ హీరో పేరు కూడా ఈ సినిమాకు జత చేసి ప్రచారం చేస్తున్నారు.మరి ఆ హీరో ఎవరో కాదు.కేజిఎఫ్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న యష్ కూడా ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నాడు అంటూ వార్తలు సోషల్ మీడియాలో గట్టిగానే ప్రచారం చేసారు.మరి ప్రచారం జరుగుతున్న వార్తలో నిజం ఉందా లేదా అనే వార్తపై ఇప్పుడు క్లారిటీ లభిస్తుంది.

తాజాగా బాలీవుడ్ మీడియాతో కరణ్ జోహార్ మాట్లాడుతూ ఈ వార్తలో ఎలాంటి నిజం లేదని క్లారిటీ ఇచ్చిన్నట్టు తెలుస్తుంది.తాము ఇంకా దేవ్ పాత్ర కోసం ఎవరిని సంప్రదించలేదని అవాస్తవాలు ప్రచారం చేయకండి అంటూ చెప్పారట.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube