అక్కడ అర్ధరాత్రి సూర్యుడు ఉదయిస్తాడు... ఒక్క సారైనా అక్కడికి వెళ్లాల్సిందే!

అర్ధరాత్రి సూర్యుడు ఉదయించడమేంటని అనుకుంటున్నారా? మీరు విన్నది నిజమేనండి.ఈ విశాల ప్రపంచంలో అనేక వింతలు జరుగుతూ ఉంటాయి.

 The Sun Rises There At Midnight You Have To Go There At Least Once, Sun Rise, V-TeluguStop.com

అయితే వాటిని గుర్తించే తీరిక ఎవరికీ ఉండదు.కానీ గుర్తించినప్పుడు మాత్రం అది అద్భుతంలాగా కనబడుతుంది.

అందులో ఒక భాగమే.అర్ధరాత్రి సూర్యుడు ఉదయించడం.

అవును, భూమి ధ్రువాల చుట్టూ ఉన్న ప్రాంతానికి పరిమితమైన ఈ అద్భుతమైన దృశ్యాన్ని వీక్షించాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు.ఆర్కిటిక్, అంటార్కిటిక్ ప్రాంతాల్లో వేసవి నెలల్లో అర్ధరాత్రి దాటిన తర్వాత సూర్యుడు ఉదయిస్తాడు అనే విషయం చాలా తక్కువమందికి తెలుసు.

USలోని అలాస్కా నగరం గురించి వినే వుంటారు.మెరిసే మంచుతో కప్పబడిన పర్వతాలకు పెట్టింది పేరు అలస్కా.అలాస్కాలోని బారో అనే నగరంలో 24 గంటలూ సూర్యుడు కనిపిస్తూనే ఉంటాడని మీకు తెలుసా? అలాగే నార్వేని అర్ధరాత్రి ఉదయించే సూర్యుని భూమిగా పేర్కొంటారు.ఇక్కడ నివసించే ప్రజలు మిడ్నైట్ సన్ సౌందర్యాన్ని చూసి పులకిస్తారు.

మే, జూలై మధ్య దాదాపు 76 రోజుల పాటు ఇక్కడ సూర్యుడు అస్తమించడు.అలాగే ఫిన్లాండ్ లో కూడా అర్ధరాత్రి సూర్యుడిని కూడా చూసే అవకాశం ఉంది.

Telugu Alaska, Antarctic, Arctic, Latest, Norway, Sun, Sun Rises-Latest News - T

ఫిన్లాండ్ భూభాగాలు ఆర్కిటిక్ సర్కిల్‌కు సమీపంలో ఉంటాయి.ఇక స్వీడన్ లో , సూర్యుడు అర్ధరాత్రి అస్తమించి, తెల్లవారుజామున మళ్లీ ఉదయిస్తాడు.ఇక్కడ దాదాపు 4 నెలల పాటు సూర్యుడు నేరుగా అస్తమించడం జరగదు.స్వీడన్‌లో మిడ్‌నైట్ సన్‌ని చూసిన అనుభవం చాలా అద్భుతంగా ఉంటుందని జీవితంలో ఒక్కసారైనా దానిని చూడాలని చూసినవారు చెబుతూ వుంటారు.

అలాగే కెనడాలోని యుకాన్, వాయువ్య భూభాగాలు, నునావట్ ప్రాంతాల్లో తరచుగా సూర్యుడు అర్ధరాత్రి ఉదయిస్తాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube