మనుషులకు నటించడం వెన్నతో పెట్టిన విద్య.తమకు ఏదో కష్టం వచ్చిందని అప్పు కోసం చాలా మంది అబద్ధాలు చెబుతుంటారు.
చావు బ్రతుకుల్లో ఉన్నామని నటించి, అవతలి వారి దగ్గర సానుభూతి పొందుతారు.డబ్బులు అప్పు తీసుకుని చక్కగా ఎంజాయ్ చేస్తుంటారు.
ఇక చిన్నతనంలో చాలా మంది టీచర్ల దగ్గర చేసే యాక్టింగ్ మామూలుగా ఉండదు.టీచర్ చిన్న దెబ్బ వేసినా, ఒక్కోసారి కొట్టక ముందే మెలికలు తిరిగి పోతారు.
కొందరైతే ఏకంగా కిందపడి దొర్లుతుంటారు.దీంతో వారిని దెబ్బ కొట్టాలనుకున్న టీచర్లు అవాక్కవుతుంటారు.
అయితే ఇటీవల కొన్ని మేకలు చేసిన యాక్టింగ్ అందరినీ నవ్విస్తోంది.దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
జంతువులకు సంబంధించిన ఎన్నో ఫన్నీ వీడియోలు మనకు నెట్టింట కనిపిస్తున్నాయి.వాటిలో కొన్ని నవ్విస్తాయి.తాజాగా అలాంటి వీడియోను వైరల్ హాగ్ అనే ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు.అందులో కొన్ని మేకలు గడ్డి మేస్తూ ఉంటాయి.అదే సమయంలో ఓ ట్రక్కు అటుగా వస్తుంది.తమ దగ్గరగా ఆ ట్రక్కు రాగానే ఆ మేకలు భిన్నంగా ప్రవర్తించాయి.
ఉన్నపళంగా కింద పడి పోయి చలనం లేకుండా ఉండిపోయాయి.ఆ దృశ్యం చూసిన వారికి ఆ ట్రక్కు గుద్దేయడంతో ఆ మేకలు చనిపోయి ఉంటాయని భావిస్తారు.
సరిగ్గా చూస్తే మేకలకు ఆ ట్రక్కుకు చాలా దూరం ఉంటుంది.దీంతో ఈ వీడియోలో ఆ మేకల ప్రవర్తన చూసిన వారు పొట్ట చెక్కలయ్యేలా నవ్వుతున్నారు.
ఆ మేకలు నటనలో మనుషులను మించిపోయాయని కామెంట్లు చేస్తున్నారు.దీనికి సంబంధించిన వీడియోకు నెటిజన్ల నుంచి విశేష స్పందన వస్తోంది.