ఇంట్లో చిన్న చిన్న వంటకాలు అంటే వంట గదిలో చేస్తూ ఉంటారు.ఇంట్లో ఉండే వంట గదిలోనే ఎంతో జాగ్రత్తగా వాస్తు ప్రకారం నిర్మిస్తూ ఉంటారు.
ఎందుకంటే వంటగది అనేది ఎంతో ముఖ్యం.వంట చేసేటప్పుడు పొగ వాసన ఇవన్నీ బయటికి వెళ్లడానికి గాలి వెలుతురు ఉండేలా వంటగదిని నిర్మిస్తూ ఉంటారు.
వంట గదిలో ఇంటి వరకు చిన్న చిన్న వంటకాలు చేసుకునే వీలుంటుంది.కానీ ఏవైనా శుభకార్యాలకు, పండుగలకు, పెళ్లిళ్లకు పెద్ద పెద్ద వంటకాలు చేయాలంటే ఇంటి ఆవరణంలోనే బయట ఎక్కడైనా ఉంటాదని ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు.
అలా చేయాలంటే ఏ ప్రదేశం లో వంట గదిని ఏర్పాటు చేసుకోవడం మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం.ముఖ్యంగా ఎక్కడ అయినా ఉండేటువంటి వంట గదులకు గాలి, వెలుతురు వచ్చే గదులు కచ్చితంగా ఉండాలి.
లేదంటే పొగ కమ్ముకొని ఇబ్బంది ఎదుర్కోవాల్సి వస్తుంది.ఇంటి చుట్టూ ఉండే ఆవరణంలో ఉత్తర వాయువ్యంలో వంటగది నీ విశాలంగా కట్టి చుట్టూ ఏదైనా జాలీలను అమర్చి వంటగదిని నిర్మించుకోవచ్చు.
సెల్లర్ లో వంట గదిని నిర్మించడం మంచిది కాదు.

ఎందుకంటే సహజంగానే అక్కడ చీకటి ఎక్కువగా ఉంటుంది కాబట్టి క్రిమి కీటకాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి.వంటకు ఎండ గాలి వచ్చే అవకాశం ఉండే శుభ్రమైన ప్రదేశం అవసరం.పడమర ఉత్తర వీధి ఉంటే ఇంటి ఆవరణంలో తూర్పు ఆగ్నేయంలో విశాలమైన పెద్ద వంటగది నిర్మించుకోవడం సౌకర్యంగా ఉంటుంది.
ఇలా బయటికి ప్రదేశాలలో పెద్ద పెద్ద వంటకాల కోసం వంటగదిని నిర్మించుకున్నప్పుడు ఎంతో జాగ్రత్తగా ఉండాలి.లేదంటే ఏవైనా ప్రమాదాలు జరిగే అవకాశం కూడా ఉంది.
DEVOTIONAL