దీపావళి రోజు న్యూయార్క్ లో సెలవు హర్షం వ్యక్తం చేసిన ప్రియాంక చోప్రా..!!

ఇండియాలో అతిపెద్ద పండుగలలో ఒకటి దీపావళి.భారతీయులు ఎంతో ఘనంగా జరుపుకునే ఈ పండుగ నాడు కుటుంబ సమేతంగా పూజలు నిర్వహించి.బాణాసంచ కాలుస్తారు.చెడుపై మంచిని గెలిచే అభివర్ణించే పండుగగా జరుపుకుంటారు.అయితే ఈ పండుగకు అగ్ర దేశం అమెరికాలోని న్యూయార్క్ పట్టణంలో అక్కడ పాఠశాలలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది.అమెరికా ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై బాలీవుడ్ నటి మరియు నిర్మాత ప్రియాంక చోప్రా జొనస్ సంతోషం వ్యక్తం చేసింది.

 Priyanka Chopra Expressed Holiday Joy In New York On Diwali Day ,diwali, Priyank-TeluguStop.com
Telugu America, Diwali, Kamala Harris, York, Yorkmayor, Priyanka Chopra-Telugu N

2023 నుండి ప్రతి సంవత్సరం దీపావళి రోజునా సెలవు ఉంటుందని న్యూయార్క్ మేయర్ ఎరిక్ ఆడమ్స్ ప్రకటనపై ప్రియాంక చోప్రా ఈ రీతిగా స్పందించారు.తన చిన్నతనంలో న్యూయార్క్ లోని క్వీన్స్ లో పాఠశాలలకు వెళ్ళినప్పటి రోజులను గుర్తుకు చేసుకుని ఏడ్చేసానని తెలిపింది.న్యూయార్క్ నగరంలో సుమారు రెండు లక్షల మంది హిందూ, సిక్కు, బౌద్ధ, జైన మతస్తులున్నారు.వీళ్లంతా దీపావళి పండుగను జరుపుకుంటారని అందుకే సెలవు ప్రకటన నిర్ణయం తీసుకున్నట్లు మేయర్ ఎరిక్ ఆడమ్స్ తెలియజేయడం జరిగింది.

 అంతేకాదు అమెరికా ఉపాధ్యక్షురాలు కమల హారిస్ అధికార నివాసంలో దీపావళి వేడుకలు కూడా ఇటీవల జరిగాయి.ఏది ఏమైనా భారతదేశంలో అతిపెద్ద పండుగ దీపావళిని అమెరికన్లు కూడా జరుపుకోవటం పట్ల భారతీయులు చాల సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube