ఆ హీరోని చూసి నేర్చుకోండి.. స్టార్ ప్రొడ్యూసర్లు నిర్మాతలపై సెటైర్లు వేసిన వర్మ?

కన్నడ హీరో రిషబ్ శెట్టి నటించిన కాంతార సినిమా దేశవ్యాప్తంగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంది ప్రస్తుతం ఎవరి నోట వెంట చూసినా కాంతార సినిమా పేరు వినపడుతుంది.ఇప్పటికే ఈ సినిమా అన్ని భాషలలో ప్రదర్శితమవుతూ ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకోగా ఎంతో మంది సినీ సెలబ్రిటీలు ఈ సినిమా పై స్పందిస్తూ పెద్ద ఎత్తున ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

 Look At That Hero And Learn Did The Star Verma Make Satires On The Producers , V-TeluguStop.com

ఇకపోతే ఈ సినిమాపై ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ స్పందించారు.

ఈ సందర్భంగా రామ్ గోపాల్ వర్మ స్పందిస్తూ ఈ సినిమాపై ప్రశంసల వర్షం కురిపించడమే కాకుండా ఇండస్ట్రీలో స్టార్ ప్రొడ్యూసర్ల పై డైరెక్టర్లకు తనదైన శైలిలో సెటైర్లు వేస్తూ ఈయన చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

ఈ సందర్భంగా ఈ సినిమా విజయం పై స్పందించిన వర్మ ముందుగా చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ… కన్నడ మూవీ కాంతార సినిమా కలెక్షన్ల సునామి సృష్టిస్తుందని తెలిపారు.భాషతో సంబంధం లేకుండా అన్ని ప్రాంతాలలో సక్సెస్ టాక్ సొంతం చేసుకుంది.

Telugu Kantara, Ram Gopal Varma, Rishabh Shetty, Verma-Movie

ఇక ఈ సినిమా రాబడుతున్న కలెక్షన్లు చూసి పెద్ద పెద్ద నిర్మాతలు డైరెక్టర్లకు నిద్ర పట్టడం లేదు.అంటూ ఇండస్ట్రీలో ఉన్నటువంటి స్టార్ ప్రొడ్యూసర్లకు డైరెక్టర్లకు తనదైన శైలిలో పంచ్ వేయడమే కాకుండా ఇలాంటి ఓ గొప్ప సినిమాని అందించినందుకు నటుడు రిషబ్ శెట్టి కి ధన్యవాదాలు తెలిపారు.మొత్తానికి వర్మ ఈ సినిమాపై ప్రశంసలు కురిపిస్తూనే కొంతమంది దర్శక నిర్మాతలకు తనదైన శైలిలో పంచ్ ఇచ్చాడని చెప్పాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube