బిగ్ బాస్ లో నేర చరిత్ర కలిగిన వ్యక్తులు వీరే !

బిగ్ బాస్… ఇదొక అతిపెద్ద రియాలిటీ షో.డచ్ లో ప్రారంభమైన ఈ షో ఇండియాలో ప్రవేశించి మొదట బాలీవుడ్ లో, ఆ తర్వాత అనేక రాష్ట్రాల్లో తిరుగుతూ ప్రస్తుతం 9 రాష్ట్రాల్లో సంచలనంగా మారింది.

 Bigg Boss Contestants With Criminal Background Sajid Khan Seema Parihar Sampat P-TeluguStop.com

ఎన్నో వివాదాలకు సైతం ఈ షో కేంద్రబిందువుగా ఉంది.ఇది బుల్లితెరపై ఎంతో వినోదాన్ని పంచుతున్న షో.ఇందులో ఎంతో మంది కంటెస్టెంట్స్ పాల్గొంటూ ఉంటారు.అయితే హిందీలో ప్రచారం అవుతున్న ఈ షోలో కొంతమంది రాజకీయ నాయకులు అలాగే సెలబ్రిటీలు, నేర చరిత్ర కలిగిన వారు సైతం పాల్గొనడం కొన్నిసార్లు వివాదానికి కూడా దారితీసింది.

ఎన్నో కేసులు, నేర చరిత్ర ఉన్న వారిని బిగ్ బాస్ లోకి పంపించడం పై సర్వత్రా విమర్శలు ఎదురైనా కూడా ఆ ఫార్మాట్లో సైతం సక్సెస్ఫుల్ గా తన టిఆర్పి రేటింగ్స్ ని పెంచుకుంటూ వెళ్ళింది ఈ షో.ఇలా బిగ్ బాస్ లో పాల్గొన్న నేరచరిత్ర కలిగిన వారు ఎవరో తెలుసుకుందాం.

సాజిద్ ఖాన్

బాలీవుడ్ లో 16వ సీజన్లో ఒక కంటెస్టెంట్ గా పాల్గొన్నారు సాజిద్ ఖాన్.ఈయన షోకి రావడంతో సోషల్ మీడియాలో తీవ్రమైన ట్రోలింగ్ జరిగింది.2014లో సాజిద్ మీటు ఉద్యమంలో ఒక నిందితుడిగా ఉన్నాడు.అనేకమంది మహిళలు ఇతడి పై వేధింపుల విషయాలను ఆరోపణలు చేశారు.

ఇక ప్రస్తుతం దర్శకత్వం కూడా చేయలేని పరిస్థితిలో ఉన్న సాజిద్ ఖాన్ హౌస్ ఫుల్ 4 సినిమా కి చివరగా దర్శకత్వం వహించారు.ఎంతో క్రిమినల్ బ్యాగ్రౌండ్ ఉన్న సాజిద్ ఖాన్ బిగ్ బాస్ లోకి తీసుకోవడం పెను దుమారాన్ని లేపింది.

సీమ పరిహర్

మాజీ బందిపోటు అయినా సీమ ఆ తర్వాత రాజకీయాల్లోకి ప్రవేశించి 2010లో బిగ్ బాస్ లో పోటీదారు కంటస్టెంట్ గా కూడా ఉంది.76 రోజుల పాటు సాగిన ఆమె ప్రయాణం సైతం ఎన్నో వివాదాలకు తావిచ్చింది.ఈమె పూలన్ దేవిని ఆదర్శంగా తీసుకొని ఎంతో నేర చరిత్రను కలిగి ఉంది.జైలుకు సైతం వెళ్లొచ్చింది.ఈమెకు చాలా క్రిమినల్ మైండ్ ఉంటుందని అంటూ ఉంటారు బండిట్ క్వీన్ అనే సినిమాలో సీమ నటించింది.

సంపత్ పాల్

ఈమె ఒక దోపిడీ బృందానికి నాయకత్వం వహిస్తోంది.పింక్ గ్యాంగ్ అని కూడా అంటారు అలాగే గులాబీ గ్యాంగ్ అని పిలవబడే ఈ గ్యాంగ్ ఎంతోమంది నేర చరిత్ర కలిగిన అధికారులను, గృహ హింసకు పాల్పడుతున్న వ్యక్తులను చితకబాదిన చరిత్ర ఉంది.రెండు సార్లు జైలుకు సైతం వెళ్ళింది.

Criminals In Bigg Boss House

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube