పూలను, ప్రకృతినే దైవంగా భావించి పూజించే పండగ బతుకమ్మ. ఎక్కడా లేని ఈ సంప్రదాయం కేవలం తెలంగాణకే సొంతం.
మొత్తం తొమ్మిది రోజుల పాటు పలు చోట్ల మరిన్ని ఎక్కువ రోజుల పాటు జరిగే బతుకమ్మ మెజార్టీ ప్రాంతాల్లో పెత్తరమాస రోజున ప్రారంభం అవుతుంది.ఎంగిలి పూల బతుకమ్మతో మొదలై.
సద్దుల బతుకమ్మ వరకు సాగుతుంది.చివరి రోజు ఊరంతా కలిసి ఆట పాటలతో, బతుకమ్మ పాటలతో, డీజే హోరుతో, డప్పు చప్పుళ్లతో ఉత్సాహంగా బతుకమ్మను నిమ్మజ్జనం చేయడంతో బతుకమ్మ పండగ ముగుస్తుంది.
అయితే బతుకమ్మ వెనక చాలా కథలే ఉన్నాయి.అవేంటో ఇప్పుడు చూద్దాం.దక్షిణ భారతదేశాన్ని పాలించిన చోళ రాజుకు ఎన్నో పూజల ఫలితంగా ఓ బిడ్డ జన్మిస్తుంది.ఆ బిడ్డకు బతుకమ్మ అని పేరు పెడతారు.
అప్పటి నుండి బతుకు ప్రసాదించాలని బతుకమ్మ పండగ చేస్తున్నారని పురాణ గాధ.ఏడుగురు అన్నదమ్ములకు ఓ చెల్లి.ఆమె అన్నలకు ప్రాణమైనా వదినలకు మాత్రం అసూయ.ఓ రోజు అన్నలంతా వేటకు వెళ్లి ఆలస్యంగా ఇంటికి వచ్చారు.
కానీ అప్పటికే వదినల పోరు భరించలేక ఆ యువతి ఇల్లు వదిలి వెళ్లిపోతుంది.ఆ విషయాన్ని తెలుసుకున్న అన్నలు వెతకడానికి వెళ్లగా.వారికి తామరపువ్వు రూపంలో కనిపిచిందని.తర్వాత ఆ తామరను రాజు పొలంలో నాటగా.చుట్టూ తంగేడు మొక్కలు మొలిచాయని అంటారు.ఆత్మత్యాగంతో వరద నుండి ఊరిని కాపాడిందని, మహిషాసురుని చంపిన తర్వాత అలసి సొలసి మూర్చపోయిన అమ్మవారిని.
మహిళలంతా కలిసి పాటలతో స్పృహ తెప్పించే ప్రయత్నమని మరికొందరు చెబుతారు.
DEVOTIONAL