అక్కడ చికెన్ బిర్యానీ ధర కేవలం రూ.2 మాత్రమే.. అదనంగా గుడ్డు ఫ్రీ..!

టీడీపీ నేత, నటసింహం నందమూరి బాలకృష్ణ హిందూపురం ఎమ్మెల్యేగా కొనసాగుతున్న విషయం తెలిసిందే.అయితే హిందూపురంలో అతని సతీమణి వసుంధర నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా మే నెల చివరి రోజుల్లో అన్న క్యాంటీన్‌ను లాంచ్ చేశారు.

 Anna Canteen Gives Non Veg Food For Only 2 Rupees , Anna Canteen, Food For Poor-TeluguStop.com

ఆ సమయం నుంచి ఇప్పటి వరకు దాదాపు ఉచితంగా భోజనం అందిస్తూనే ఉంది నందమూరి కుటుంబం.అయితే ఇలా అన్న కాంటీన్ ద్వారా భోజనం అందించడం స్టార్ట్ చేసి సెప్టెంబర్ 4 వ తేదీకి వంద రోజులు పూర్తయ్యింది.

ఈ ప్రత్యేక రోజున బాలకృష్ణ స్పెషల్ ఫుడ్‌ను రూ.2కే ఆఫర్ చేయాలనే నిర్ణయం తీసుకున్నారు.అనుకున్నదే తడవుగా ఆదివారం రోజు బిర్యానీ, చికెన్, గుడ్డు, స్వీట్‌ వంటి చక్కటి భోజనాన్ని అన్న క్యాంటీన్ ద్వారా కేవలం రూ.2కే అందించారు.ఒక హిందూపురం లోనే కాదు చాలా చోట్లా తక్కువ ధరలకే ఆహారం అందించే అన్నా క్యాంటీన్లు వెలిశాయి.అమెరికాలో నివసిస్తున్న ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా క్యాంటీన్‌ను ఏర్పాటు చేశారు.

ఇక తాను ఓపెన్ చేసిన అన్న క్యాంటీన్ వంద రోజులు పూర్తి చేసుకోవడం తనకు ఎంతో సంతోషాన్ని ఇస్తోందని వసుంధర పేర్కొన్నారు.ఎన్టీఆర్ కోడలి అయినందుకు తాను ఎంతగానో గర్విస్తున్నానని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా ఆమె హిందూపురాన్ని నందమూరి పురం అని అభివర్ణించడం హాట్ టాపిక్ అయ్యింది.

Telugu Anna Canteen, Poor, Hindupuram Mla, Nandamuritaraka, Veg Rupees, Ntrs Cha

ఇక బాలకృష్ణ తన నియోజకవర్గ ప్రజలకు ఉచిత వైద్య సేవలు అందించేందుకు ‘ఎన్టీఆర్ ఆరోగ్య రథం’ కూడా ప్రారంభించారు.రూ.40 లక్షల బడ్జెట్‌తో ఎన్టీఆర్‌ ఉచిత ఆరోగ్య రథం కింద 200కు పైగా వ్యాధి నిర్ధారణ పరీక్షలు, వైద్యుల సంప్రదింపులు, మాతా శిశు సంరక్షణ, ఆరోగ్య అవగాహన సదస్సులు గ్రామాల్లో నిర్వహిస్తారు.నందమూరి కుటుంబం అందిస్తున్న ఈ సేవలకు ఆ నియోజకవర్గ ప్రజలు ఎంతగానో సంతోషిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube