నైట్ ఈ హోం మేడ్ క్రీమ్‌ను రాస్తే.. ఉద‌యానికి ముఖం షైనీగా మెరుస్తుంది!

సాధార‌ణంగా కొంద‌రి ముఖం ఉద‌యానికి చాలా డ‌ల్‌గా మారిపోతుంటుంది.డీహైడ్రేషన్, ఆహార‌పు అల‌వాట్లు, కంటి నిండా నిద్ర లేకపోవ‌డం, మాయిశ్చరైజర్ ను ఎవైడ్ చేయ‌డం, డెడ్ స్కిన్ సెల్స్ వంటి ర‌క‌ర‌కాల కార‌ణాల వ‌ల్ల చ‌ర్మం డ‌ల్ గా మారుతుంటుంది.

 If You Apply This Home Made Cream At Night, Your Face Will Be Shiny In The Morni-TeluguStop.com

అటువంటి డ‌ల్ స్కిన్ తో బ‌య‌ట‌కు వెళ్లాలంటేనే సంకోచిస్తుంటారు.మీకు ఇలాంటి పరిస్థితులు ఎదుర‌వుతూనే ఉంటాయి.

అయితే ఇప్పుడు చెప్ప‌బోయే హోం మేడ్ క్రీమ్‌ను నైట్ నిద్రించే ముందు రాసుకుంటే.ఉద‌యానికి ముఖం షైనీగా మ‌రియు గ్లోయింగ్‌గా మెరుస్తుంది.

డ‌ల్ స్కిన్ అన్న స‌మ‌స్యే ఉండ‌దు.మ‌రి ఇంకెందుకు ఆల‌స్యం ఆ హోం మేడ్ క్రీమ్‌ను ఎలా త‌యారు చేసుకోవాలో ఓ చూపు చూసేయండి.

ముందుగా స్ట‌వ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని గ్లాస్ వాట‌ర్ పోయాలి.వాట‌ర్ హీట్ అవ్వ‌గానే అందులో గుప్పెడు ఎండు గులాబీ రేక‌లు, అర క‌ప్పు నిమ్మ పండు తొక్క‌లు వేసి ప‌ది నుంచి ప‌దిహేను నిమిషాల పాటు మ‌రిగించాలి.

ఆపై స్ట‌వ్ ఆఫ్ చేసి స్ట్రైన‌ర్ సాయంతో.వాట‌ర్‌ను ఫిల్ట‌ర్ చేసుకోవాలి.ఈ వాట‌ర్‌ను పూర్తిగా చ‌ల్లార‌బెట్టుకోవాలి.

ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని అందులో మూడు టేబుల్ స్పూన్ల అలోవెర జెల్‌, హాఫ్ టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్‌, హాఫ్ టేబుల్ స్పూన్ విట‌మిన్ ఇ ఆయిల్ వేసుకుని మిక్స్ చేసుకోవాలి.

చివ‌రిగా మొద‌ట త‌యారు చేసి పెట్టుకున్న రోజ్ అండ్ లెమ‌న్ వాటర్‌ను రెండు లేదా మూడు టేబుల్ స్పూన్లు వేసి బాగా క‌లుపుకుంటే క్రీమ్ సిద్ధం అయిన‌ట్లే.

Telugu Tips, Cream, Latest, Shiny Skin, Skin Care, Skin Care Tips-Telugu Health

ఈ క్రీమ్‌ను ఒక బాక్స్‌లో నింపుకుని ఫిడ్జ్‌లో స్టోర్ చేసుకుంటే ప‌దిహేను రోజుల పాటు వాడుకోవ‌చ్చు.రాత్రి నిద్రించే ముందు త‌యారు చేసుకున్న క్రీమ్‌ను ముఖానికి అప్లై చేసుకుని సున్నితంగా మ‌సాజ్ చేసుకోవాలి.ఇలా ప్ర‌తి రోజు చేస్తే ఉద‌యానికి ముఖం షైనీగా మ‌రియు గ్లోయింగ్‌గా మెర‌వ‌డం ఖాయం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube