తెలుగులో ఊహించని స్థాయిలో పాపులర్ అయిన వాళ్లలో పునర్నవి ఒకరు.చేసింది తక్కువ సినిమాలే అయినా ఆమె నటించిన సినిమాలు సక్సెస్ సాధించడంతో పాటు మంచి పాత్రలు దక్కడం ఆమెకు ప్లస్ అయింది.
పలు వెబ్ సిరీస్ లలో కూడా పునర్నవి నటించగా ఆ వెబ్ సిరీస్ లు సైతం అంచనాలకు మించి సక్సెస్ ను సొంతం చేసుకున్నాయి.సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే పునర్నవి నెటిజన్ల ప్రశ్నలకు సైతం తన శైలిలో జవాబులు ఇవ్వడానికి ఇష్టపడతారు.
బిగ్ బాస్ మూడో సీజన్ లో పాల్గొన్న పునర్నవి ఈ షో వల్ల ఊహించని స్థాయిలో పాపులారిటీని సొంతం చేసుకున్నారు.రాహుల్ సిప్లిగంజ్ తో లవ్ ట్రాక్ కూడా ఆమె ఎక్కువగా వార్తల్లో నిలవడానికి కారణమైంది.
కమిట్ మెంటల్ వెబ్ సిరీస్ ప్రమోషన్స్ లో భాగంగా తనకు ఎంగేజ్మెంట్ అయినట్టు వెల్లడించిన పునర్నవి ఆ తర్వాత వెబ్ సిరీస్ కోసం ఆ విధంగా ప్రమోషన్స్ చేసినట్టు తెలిసి కొంతమంది నెటిజన్లు ఆమెను ట్రోల్ చేశారు.
తాజాగా నెటిజన్లతో పునర్నవి ముచ్చటించగా ఒక నెటిజన్ పునర్నవి ని నువ్వు వర్జిన్ వేనా అని ప్రశ్నించారు.మరో నెటిజన్ ఆమెతో ఏకంగా ఎవరితోనైనా డేటింగ్ చేస్తున్నా అని ప్రశ్నించడం గమనార్హం.నేను ఇలాంటి ప్రశ్న కోసమే ఎదురుచూస్తున్నా అంటూ మొదటి ప్రశ్నకు అవును ఆమె అంటూ రెండో ప్రశ్నకు జవాబిచ్చారు.
ఆ ప్రశ్నలు అడిగిన నెటిజన్లకు బుద్ధి వచ్చేలా పునర్నవి సమాధానాలు ఉన్నాయి.అడిగిన ప్రశ్నలకు వెరైటీగా సమాధానాలు ఇచ్చి ఆ ప్రశ్నలు అడిగిన వ్యక్తులు సైలెంట్ అయ్యేలా పునర్నవి చేశారు.
పునర్నవి భూపాలం వరుస సినిమాలతో బిజీ కావాలని ఆమె అభిమానులు కోరుకుంటున్నారు.సినిమాసినిమాకు పునర్నవి క్రేజ్ పెరుగుతున్న సంగతి తెలిసిందే.