బాలీవుడ్ స్టార్ హీరో కండల వీరుడు సల్మాన్ ఖాన్ కి ప్రాణం భయం పట్టుకుందా అంటే అవుననే వార్తలు వినిపిస్తున్నాయి.సల్మాన్ ఖాన్ కు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి చంపేస్తాము అంటూ బెదిరింపులు వచ్చిన విషయం మనందరికి తెలిసిందే.
ఈ విషయం పట్ల సల్మాన్ ఖాన్ కాస్త భయపడుతున్నాడట.ఈ క్రమంలోనే తనని తాను రక్షించుకోవడం కోసం ఇటీవల లైసెన్స్ ఉన్న గన్నును కూడా తీసుకున్న విషయం తెలిసిందే.
కాగా తాజాగా సల్మాన్ ఖాన్ తీసుకున్న మరొక నిర్ణయం ప్రస్తుతం బాలీవుడ్ సినీ వర్గాలలో హాట్ టాపిక్ గా మారింది.
అసలు విషయంలోకి వెళితే.
కండల వీరుడు సల్మాన్ ఖాన్ 2007లో కృష్ణ జింకను వేటాడు అన్న ఆరోపణలు ఉన్నాయి అన్న సంగతి తెలిసిందే.ఇదే విషయంపై అతడి పై కోర్టులో విచారణ కూడా కొనసాగుతోంది.
ఇక అప్పటి నుంచి సల్మాన్ ను హత్య చేయాలని లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ప్రయత్నిస్తోంది.ఈ క్రమంలోనే సల్మాన్ ఖాన్, అతడి తండ్రి సలీమ్ ఖాన్ లను చంపుతామని బెదిరింపు లేఖను కూడా రాసారు.
ఆ లేఖలో పంజాబ్ సింగర్ మూసేవాలకు పట్టిన గతే నీకూ పడుతుంది అని రాశారు.అంతే కాకుండా సల్మాన్ ఖాన్ ఇంటి ముందు అనుమానాస్పందగా ఓ వాహనం ఉండటం అప్పట్లో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.
ఇది ఇలా ఉంటే తాజాగా సల్మాన్ ఖాన్ ముంబై పోలీసులను ఆశ్రయించాడు.సల్మాన్ ఖాన్ పోలీసులను ఆశ్రయించడంతో పోలీసులు అతనికి భద్రతను కల్పించారు.తనకు ప్రాణహాని ఉన్నందువల్ల సల్మాన్ గన్ లైసెన్స్ ను సైతం పొందారు.తాజాగా మరొక అడుగు ముందుకు వేసి బుల్లెట్ ప్రూఫ్ కారుని కొనుగోలు చేశాడు.ఈ క్రమంలోనే సల్మాన్ టయోటా ల్యాండ్ క్రూయిజర్ బుల్లెట్ ఫ్రూప్ కారులో ప్రయాణించడం మొదలుపెట్టాడు.తాజాగా ఈ కారులో ప్రయాణిస్తూ కెమెరాకు చిక్కాడు.సల్మాన్ ఖాన్ కారు ధర దాదాపుగా రూ.1.5 కోట్లు అని తెలుస్తోంది.కాగా ప్రస్తుతం సల్మాన్ ఖాన్ ఆ కారులో తిరిగే ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
బిష్ణోయ్ గ్యాంగ్ బెదిరింపుల నేపథ్యంలోనే సల్మాన్ ఈ కారును కొనుగోలు చేసినట్లు అతని సన్నిహితులు చెప్తున్నారు.