పారితోషికం తగ్గింపుకు హీరోలు ఓకే.. మరి దర్శకుల పరిస్థితి ఏంటీ?

టాలీవుడ్ సినిమా ల యొక్క బడ్జెట్‌ భారీ గా పెరగడంతో నిర్మాతలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.కరోనా తర్వాత థియేటర్లకు జనాలు రావడం చాలా వరకు తగ్గింది.

 Tollywood Directors Going To Cut There Remunerations For New Films Tollywood ,-TeluguStop.com

దాంతో భారీ చిత్రాలు కూడా వసూళ్ల విషయంలో మొగ్గలేక పోతున్నాయి.దాంతో బడ్జెట్‌ తగ్గించుకునేందుకు నిర్మాతలు ప్రయత్నాలు చేస్తున్నారు.

తమ ఇబ్బందులు పరిష్కరించే వరకు కూడా తాము బంద్‌ పాటించబోతున్నట్లుగా ఇటీవలే ఫిల్మ్‌ నిర్మాతల యొక్క మండలి నుండి అధికారికంగా ప్రకటన వచ్చిన విషయం తెల్సిందే.బడ్జెట్‌ విషయంలో తగ్గింపు కోసం పారితోషికం ను తగ్గించుకునేందుకు కొందరు హీరోలు ముందుకు వచ్చారు.

ఎన్టీఆర్‌, రామ్‌ చరణ్ మరియు అల్లు అర్జున్ లు ఇప్పటికే పారితోషికం ను తగ్గించుకుంటామని దిల్‌ రాజుకు హామీ ఇచ్చారట.వారు ముగ్గురు మాత్రమే కాకుండా చాలా మంది హీరోలు కూడా పారితోషికం ను అందరితో పాటు తగ్గించుకునేందుకు తమకు ఎలాంటి ఇబ్బంది లేదని ప్రకటించారు.

దాంతో ఇప్పుడు అందరి దృష్టి దర్శకుల మీద పడింది.

టాలీవుడ్‌ లో పాతిక నుండి యాబై మరియు వంద కోట్ల పారితోషికం తీసుకునే దర్శకులు కూడా ఉన్నారు.

ఏ ఇతర ఇండస్ట్రీ లో లేనంత ఖరీదైన దర్శకులు ఇక్కడ ఉన్నారు.కనుక వారు పారితోషికం తగ్గించుకునే విషయాన్ని ఎవరు ప్రశ్నిస్తారు.

అసలు వారు పారితోషికం తగ్గించుకునే యోచనలో ఉన్నారా అంటూ ఇండస్ట్రీ లో కొందరు ప్రశ్నిస్తూ ఉన్నారు.ఇతర నటీ నటులకు కూడా పారితోషికం విషయం లో తగ్గించాలని నిర్ణయానికి వచ్చారు.

మొత్తానికి ఇండస్ట్రీలో కాస్ట్‌ కట్టింగ్‌ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది.ఇది ఎంత వరకు వెళ్తుంది అనేది చూడాలి.

 రాజమౌళి, సుకుమార్‌, త్రివిక్రమ్‌ లతో పాటు ఇంకా కొందరు దర్శకులు పారితోషికం విషయంలో హీరో లను మించి పోయారు.వీరు కూడా తగ్గించుకుంటేనే బడ్జెట్‌ తగ్గుతుంది.

బడ్జెట్‌ అనేది పూర్తిగా దర్శకుడి చేతిలో ఉంది.దర్శకుడు బడ్జెట్‌ తగ్గించాలని బలంగా కోరుకుంటే కచ్చితంగా తగ్గుతుంది అనేది సినీ విశ్లేషకుల అభిప్రాయం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube