నీ కోరికలు అన్నీ తీరాలి రవికృష్ణ అంటూ నవ్య స్వామి పోస్ట్.. లవ్ బర్డ్స్ అంటూ కామెంట్స్?

బుల్లితెర ముద్దుగుమ్మ నవ్య స్వామి పరిచయం బుల్లితెర ప్రేక్షకులందరికి తెలిసిందే.తన అందం, నటనతో ప్రేక్షకుల హృదయాలను దోచుకున్న నవ్య స్వామి ఈటీవీ లో ప్రసారమైన నా పేరు మీనాక్షి సీరియల్ లో కీలక పాత్రలో నటించి తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది.

 Navya Swamy Post On Ravi Krishna Birthday Viral Netizens Comments Details, Navy-TeluguStop.com

తన నటనకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకుంది.ఇక ఈ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటుంది.

తొలిసారిగా కన్నడ సీరియల్ తో బుల్లితెరకు పరిచయమైన నవ్య స్వామి ఆ తర్వాత తమిళంలో కూడా నటించింది.ఇక తెలుగు ఇండస్ట్రీకి నా పేరు మీనాక్షి సీరియల్ తో పరిచయము కాగా స్టార్ మా లో ప్రసారమైన ఆమె కథ సీరియల్ లో కూడా నటించింది.

ఈ సీరియల్ అతి తక్కువ సమయంలో ముగింపు పలికింది.ఇక ఈ సీరియల్ నటుడు, బిగ్ బాస్ కంటెస్టెంట్ రవి కృష్ణ తో బాగా సన్నిహితంగా ఉంటుందన్న విషయం అందరికి తెలిసిందే.

గతంలో వారి మధ్య ప్రేమాయణం నడుస్తున్నట్లు బాగా గుసగుసలు వినిపించాయి.కానీ పలు ఇంటర్వ్యూలలో పాల్గొన్నప్పుడు తమ మధ్య ఎటువంటి ప్రేమ లేదని అవన్నీ పుకార్లేనని స్పష్టం చేశారు.

కానీ వీరిద్దరూ కలిసి ఈవెంట్లలో, షో లలో బాగా పాల్గొంటారు.అంతేకాకుండా చూడటానికి ఎంతో సన్నిహితంగా కనిపిస్తారు కూడా.

ఇక తమ సోషల్ మీడియా వేదికగా తాము కలిసి దిగిన ఫోటోలను కూడా బాగా షేర్ చేసుకుంటారు.పైగా వెంటనే లవ్ సింబల్స్ తో స్పందిస్తుంటారు.

ఇక ఈమె గతంలో స్వామి అవిష్ గౌడ్ అనే వ్యక్తితో రిలేషన్ ఉందని, అతనితో విడిపోయాక ఇప్పుడు రవి కృష్ణ తో ప్రేమాయణం సాగిస్తుందని బాగా వార్తలు కూడా వినిపిస్తున్నాయి.గతంలో ఆమె ఓ షో లో పాల్గొన్నప్పుడు కూడా తన లవ్ స్టోరీ గురించి బయట పెట్టిన సంగతి తెలిసిందే.ఇప్పుడు మాత్రం రవి కృష్ణ తో రిలేషన్ లో ఉంది అని అనుకుంటున్నారు.కానీ వాళ్లు మాత్రం తాము స్నేహితులమే అని చాలాసార్లు చెప్పుకొచ్చారు.అయినా కూడా వీరిని జనాలు నమ్మడం లేదు.

ఇదిలా ఉంటే తాజాగా నవ్య స్వామి తన సోషల్ మీడియా వేదికగా ఓ ఫోటో షేర్ చేయగా అందులో రవి కృష్ణ తో పాటు తను కూడా ఉంది.ఇక రవి కృష్ణ పుట్టినరోజు సందర్భంగా అతడికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ నీ కోరికలు అన్ని తీరాలి అని ఎప్పటికీ ఇలా సంతోషంగా ఉండాలి అని తెలిపింది.ఆ ఫోటో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ గా మారడంతో ఆ ఫోటో ని చూసిన నెటిజన్లు లవ్ బర్డ్స్ అంటూ కామెంట్లు పెడుతున్నారు.

మరికొందరు క్యూట్ కపుల్స్ అని మీరు కూడా పెళ్లి చేసుకుంటే బాగుంటుంది అని అంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube