మృగశిర కార్తె రోజు చేపలు తినడానికి కారణం ఏమిటో తెలుసా?

ఈరోజే మృగశిర కార్తె. సాధారణంగా రోహిణి కార్తెలో రోళ్లు పగిలే ఎండ కాస్తుందంటారు.

 Why Do People Eat Fish On Mrigashira Karthe , Devotional , Eat Fish , Mrugash-TeluguStop.com

దాని తాపానికి ఉక్కిరిబిక్కిరి అయిన ప్రజలు తొలకరి జల్లుల కోసం వేచి చూస్తుంటారు.వేసవి తాపం నుంచి దూరం అయ్యేందుకు ఈరోజే మొదటి రోజు.

అయితే గ్రీష్మ తాపంతో ఇన్నాళ్లూ అల్లాడిపోయిన జనం చిరుజల్లుల హాయిలో సాంత్వన పొందడానికి రెడీగా ఉంది.అయితే ఇలా ఒక్క సారిగా వాతావరణం మారి ఉష్ణోగ్రతలు తగ్గిపోతాయి.

దీని వల్ల మనుషుల్లో రోగ నిరోధక శక్తి తగ్గిపోయి అనారోగ్యం బారిన పడతారు.ఈ సీజన్ లో జీర్ణ శక్తి కూడా తగ్గిపోతుంది.

వాతావరణంలోనే కాకుండా శరీరంలో కూడా ఉష్ణోగ్రతలను సమతుల్యం చేసి ఇమ్యూనిటీని పెంచడానికి చేపలు దోహదపడతాయి.అందుకే మృగశిర కార్తె మొదలవగానే చేపలు తింటారు.

కేవలం చేపలు మాత్రమే కాకుండా వాటితో పాటు బెల్లాన్ని కూడా కలుపుకొని తింటారు.ఈరోజు ప్రజలందరూ చేపలను తినడం మన పురాణ కాలాల నుంచి ఆనవాయితీగా వస్తోంది.

అయితే చేపల్లో ఉండే కాల్షిం, ఫాస్పరస్, ఐరన్, కాపర్, మెగ్నీషియం, జింక్ వంటి ఖనిజ పోషకాలు లభిస్తాయి.అలాగే మనుషులకు కావాల్సిన అతి ముఖ్యమైన రుచిని పెంచే లైసిన్, మిథియోనిన్, ఐసాల్యూసిన్ వంటి అమైనో ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి.

థయామిన్, రైబోప్లవిన్, నియాసిన్, పెరిడాక్సిన్, బయోటిన్, పెంటోదినిక్ ఆమ్లం, బీ12 వంటి విటామిన్స్ పుష్కలంగా ఉంటాయి.అందుకే మృగశిర కార్తె రోజు చేపలను తిని ఆరోగ్యాన్ని కాపాడుకుంటారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube