శేఖర్ రివ్యూ: థ్రిల్లర్ గా రొటీన్ కథతో వచ్చిన రాజాశేఖర్!

డైరెక్టర్ జీవిత రాజశేఖర్ దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘శేఖర్‘.ఇందులో రాజశేఖర్ కీలక పాత్రలో నటించగా.

 Shekhar Review Movie Review And Rating , Shekar Movie, Rajashekar, Tollywood, Ra-TeluguStop.com

ఆత్మీయ రాజన్, ముస్కాన్, అభినవ్ గోమతం, కన్నడ కిషోర్, సమీర్, భరణి, రవి వర్మ, శ్రవణ్ రాఘవేంద్ర తదితరులు నటించారు.ఇక ఈ సినిమాకు బీరం సుధాకర్ రెడ్డి, బొగ్గరం వెంకట శ్రీనివాస్ నిర్మాతలు గా బాధ్యతలు చేపట్టారు.

అనూప్ రూబెన్స్ సంగీతాన్ని అందించగా. మల్లికార్జున్ నారగాని సినిమాటోగ్రఫీ అందించారు.

ఇక ఈ సినిమా ఈ రోజు ప్రేక్షకుల ముందుకు రాగా.ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుందో.

అంతే కాకుండా రాజశేఖర్ కి ఎటువంటి సక్సెస్ ను అందించిందో చూద్దాం.

కథ: కథ విషయానికి వస్తే ఇందులో రాజ శేఖర్ శేఖర్ పాత్రలో నటించాడు.అతడు రిటైర్డ్ పోలీస్ అధికారి.అంతేకాకుండా క్రైమ్ సన్నివేశాలను పరిశోధించడం లో నిపుణుడు.ఒక్క క్షణంలో నేరస్తుడిని కనుగొనడంలో గొప్ప వ్యక్తి.ఇక ఈయన నైపుణ్యాన్ని ఉపయోగించి పోలీస్ అధికారులు డబల్ మర్డర్ కేసులు చేయించటానికి శేఖర్ సహాయం తీసుకుంటారు.

అదేసమయంలో శేఖర్ తన భార్య ఇందు (ఆత్మీయ రాజన్) నుండి విడిపోయిన జ్ఞాపకాలు తనని వెంటాడుతూ ఉంటాయి.ఒకసారి ఇందు కి ఆక్సిడెంట్ కావడంతో తాను చనిపోతుంది.

దాంతో శేఖర్ ఇందు మరణాన్ని ఇన్వెస్టిగేషన్ చేస్తాడు.ఆ ఇన్వెస్టిగేషన్లో తన భార్య యాక్సిడెంట్ లో చనిపోలేదు అని ఎవరు హత్య చేశారు అని తెలుస్తుంది.

ఇక అప్పుడే కథలో ట్విస్ట్ మొదలవుతుంది.ఇంతకు ఇందును చంపింది ఎవరు.

అసలు వీరిద్దరూ ఎందుకు విడిపోయారు అనేది మిగిలిన కథ లో చూడవచ్చు.

Telugu Abhinav Gomatam, Atmiya Rajan, Bharani, Kannada Kishore, Muskan, Rajashek

నటినటుల నటన: నటీనటుల నటన విషయానికి వస్తే యాంగ్రీ మెన్ రాజశేఖర్ నటనలో ఇప్పటికీ అదే ఎనర్జీ ఉంది.తన పాత్రతో అద్భుతంగా మెప్పించాడు.ఇక మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు.

టెక్నికల్: టెక్నికల్ పరంగా.సినిమా కథ బాగున్నా కూడా దర్శకురాలు అంతగా మెప్పించలేకపోయింది.

ఇక సినిమాటోగ్రఫీ కూడా అంతగా ఆకట్టుకోలేదు.పైగా అనూప్ రూబెన్స్ అందించిన సంగీతం థ్రిల్లర్ బట్టి ఆకట్టుకోలేనట్టుగా అనిపించింది.

Telugu Abhinav Gomatam, Atmiya Rajan, Bharani, Kannada Kishore, Muskan, Rajashek

విశ్లేషణ: చాలావరకు థ్రిల్లర్, ఇన్వెస్టిగేటివ్ సినిమాలు బాగా ఆసక్తిగా ఉంటాయి.ఇక ఈ సినిమా కూడా ఈ నేపథ్యంలో రాగా ఎందుకో అంతగా ఆకట్టుకోలేదు అన్నట్లుగా అనిపిస్తుంది.పైగా రొటీన్ సన్నివేశాలు ఉండటంతో కొత్తదనం లేనట్లు తెలుస్తుంది.నిజానికి డైరెక్టర్ జీవిత బాగా ప్రయత్నం చేసింది.కానీ కథలో కాస్త మలుపులు తిరిగే సన్నివేశాలు ఆకట్టుకోలేనట్లు అనిపించింది.

ప్లస్ పాయింట్స్: నటీనటుల నటన, థ్రిల్లింగ్ కాన్సెప్ట్.

మైనస్ పాయింట్స్: రొటీన్ సీన్స్, టీం ఇంకాస్త జాగ్రత్త పడేది ఉంటే బాగుండేది.

బాటమ్ లైన్: థ్రిల్లర్ కాన్సెప్ట్ ను ఇష్టపడే వాళ్లకు ఈ సినిమా బాగానే ఆకట్టుకుంటుంది.నిజానికి అన్ని వర్గాల ప్రేక్షకులకు ఈ సినిమా అంతగా ఆకట్టుకోదు.కేవలం థ్రిల్లర్ అభిమాని అయితే ఈ సినిమాను చూడవచ్చు.

రేటింగ్: 2.5/5

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube