మే నెల నుంచి అమలుకానున్న కొత్త రూల్స్ ఇవే..!

కొత్త నెల వచ్చిందంటే చాలు సామాన్యుల దగ్గర నుంచి ఉద్యోగస్తుల వరకు గుండెల్లో రైళ్లు పరుగేడతాయి.ఎందుకంటే నెల ప్రారంభం నుంచి దేశంలోని వివిధ అంశాల్లో పలు మార్పులు జరుగుతూ ఉంటాయి కాబట్టి.

 These Are The New Rules That Will Come Into Force From May , May Month , New R-TeluguStop.com

మరి మే నెల ప్రారంభంలోని కొత్త రూల్స్ గురించి తెలుసుకుందామా.ముందుగా గ్యాస్ సిలిండర్ విషయానికి వస్తే.

ప్రతి నెల సిలిండర్ ధర విషయంలో మార్పులు జరుగుతూనే వస్తాయి.ఎందుకంటే ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు ప్రతి నెల 1వ తారీఖున గ్యాస్ సిలిండర్ ధరలను ఎప్పటికప్పుడు మారుస్తూ ఉంటాయి.

అంటే మే 1వ తేదీన కొత్త గ్యాస్ ధరలను నిర్ణయిస్తారు.

ఇక మే నెలలో బ్యాంకులు 12 రోజుల పాటు పని చేయవు.

ఆర్బీఐ విడుదల చేసిన జాబితా ప్రకారం రాష్ట్రాల వారిగా బ్యాంకులకు సెలవులు ప్రకటించనున్నారు.అంటే మే నెలలో దాదాపు12 రోజులు పాటు బ్యాంకులు పని చేయవు అన్నమాట.

సెలవులను దృష్టిలో పెట్టుకుని మీ ఆర్ధిక లావాదేవీలను ప్లాన్ చేసుకోండి.అలాగే యాక్సిస్ బ్యాంకు యొక్క కస్టమర్స్ కు ఒక అలెర్ట్.

యాక్సిస్ బ్యాంక్ యొక్క పొదుపు ఖాతాదారులు యాక్సిస్ బ్యాంక్ ఏటీఎం నుంచి నిర్ధేశించిన అమౌంట్ కంటే ఎక్కువ డబ్బులు విత్ డ్రా చేసుకుంటే గతంలో మాదిరిగా కాకుండా రెండు రెట్లు ఎక్కువ ఛార్జీ చెల్లించాల్సి ఉంటుంది.

Telugu Axis Bank, Axis Bank Atm, Gas Cylinder, Irdasanjeevani, Latest, Ups-Lates

అలాగే మే 1 నుంచి బ్యాంకు ఖాతాల్లో ఉండే కనీస మొత్తాన్ని రూ.10,000 నుంచి రూ.15.000కు పెంచింది.అలాగే కరోనా సెకండ్ వేవ్ మధ్య కాలంలో IRDA ఆరోగ్య సంజీవని బీమా పాలసీలో కవర్ చేయాల్సిన మొత్తాన్ని రెండు రెట్లు పెంచింది.అంటే మే నుంచి భీమా కంపెనీలు రూ.10 లక్షల వరకు కవరేజ్ అందిస్తాయి.ఇక ఈ మే నెలలో కోవిడ్ టీకాలకు సంబందించి 18 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్నవారికి తప్పనిసరిగా కోవిడ్ టీకాలను వేయాలసి ఉంటుంది.మారిన ప్రభుత్వ నిబంధనల ప్రకారం 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కళ్లు కూడా కరోనా వాక్సిన్ వేయించుకోవాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube