ఆంధ్ర ప్రదేశ్ లో కరెంటు కోతలతో ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని బిజెపి రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ మండిపడ్డారు .రాష్ట్రంలో పరిశ్రమలకు కరెంటు ఇవ్వలేని పరిస్థితుల్లో వైసీపీ ప్రభుత్వం ఉందని ఆయన ఎద్దేవా చేశారు సంక్షేమ పథకాల పేర్లు చెప్పి ఆంధ్రప్రదేశ్ ను అప్పులు పాలు చేశారని సీఎం రమేష్ మండిపడ్డారు.
గడచిన మూడేళ్లల లో నిత్యావసర ధరలను ఆకాశానికి అంటుకుంటున్నాయని రాష్ట్ర ప్రభుత్వం పూర్తి బాధ్యత వహించాలని ఆయన అన్నారు వ్యవసాయానికి సరిపడా నీళ్లు అందకపోవడం రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు పెరిగాయన్నారు .రైతు పక్ష పాతి పార్టీ అని చెప్పుకునే వైసీపీ ప్రభుత్వం రైతుల ఆత్మహత్యలపై ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నించారు.