పూణెలోని ఎంసీఏ స్టేడియంలో శనివారం జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజయం సాధించింది.అయితే ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ ఎల్‌బీడబ్ల్యూ ఔట్ కాంట్రవర్సీగా మారింది.19వ ఓవర్‌లో బౌలర్ బ్రీవిస్ వేసిన తొలి బంతిని డిఫెండ్ చేయాలనుకున్నాడు కోహ్లీ.అయితే ఈ క్రమంలో బంతి బ్యాట్ తో పాటు కోహ్లీ ప్యాడ్ కు తగిలింది.
దీంతో ముంబై ఇండియన్స్ టీమ్ ఎల్‌బీడబ్ల్యూకి అప్పీల్ చేయడంతో ఫీల్డ్ అంపైర్ దాన్ని ఔట్ గా డిక్లేర్ చేశాడు.అయితే ఇది క్లియర్ గా నాటౌట్ అని కోహ్లీ భావించాడు.
అందుకే వెంటనే థర్డ్ అంపైర్ రివ్యూ కోరాడు.ఈ రివ్యూలో బాల్ ప్యాడ్, బ్యాట్ రెంటినీ ఒకేసారి టచ్ చేసినట్లు కనిపించింది.
అయితే ఇది చూసిన తర్వాత దీన్ని అందరూ నాటౌట్ అనే అనుకున్నారు.కానీ థర్డ్ అంపైర్ ఫైనల్ డెసిషన్లో ఔట్ అని ప్రకటించాడు.
“ఒకవేళ మొదటగా బంతి బ్యాట్ కు తగిలి ఆ తర్వాత ప్యాడ్ కి తగ్గినట్లయితే అది నాటౌట్ అయి ఉండేది.కానీ రెండిటికీ ఒకేసారి తగలడం వల్ల ఇది ఔట్” అని అంపైర్ మైక్‌లో ప్రకటించాడు.
అయితే ఈ నిర్ణయం తర్వాత కోహ్లీ చాలా కోప్పడ్డాడు.బ్యాట్‌ను గ్రౌండ్‌లోనే నేలకేసి బాది తన కోపాన్ని వెళ్లగొట్టాడు.
అంతేకాదు గ్రౌండ్ లో నుంచి బయటకు వెళుతూ మాటల్లో తన కోపాన్ని చూపించాడు.నిజానికి కోహ్లీ ఈ బంతికి ఔట్ కాకపోతే ఈజీగా హాఫ్ సెంచరీ చేసేవాడు.
ఎందుకంటే అప్పటికే 48 స్కోరు సాధించాడు కోహ్లీ.
అయితే, థర్డ్ అంపైర్ ఫైనల్ డెసిషన్ మ్యాచ్‌పై ఎలాంటి ప్రభావం చూపకపోవడంతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఊపిరిపీల్చుకుంది.కోహ్లీ తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన మ్యాక్స్‌వెల్ వరుసగా 2 బౌండరీలు కొట్టి జట్టును గెలిపించాడు.ఇదిలా ఉండగా ఈ థర్డ్ అంపైర్ తీసుకున్న రాంగ్ డెసిషన్ పై క్రికెట్ లవర్స్ అసంతృప్తి వ్యక్తం చేశారు.
బెస్ట్ టీవీ అంపైర్ నియమించడం బీసీసీఐ ముఖ్య బాధ్యత.ఈ విషయంలో పొరపాటు చేస్తే ఇలాగే నాటౌట్ ఔట్‌గా ప్రకటించే ప్రమాదం లేకపోలేదని క్రికెట్ అభిమానులు కామెంట్లు పెడుతున్నారు.
కోహ్లీ కోపానికి సంబంధించిన వీడియోని మీరు కూడా చూసేయండి.