సాధారణంగా మన కుటుంబంలో ఏవైనా సమస్యలు వచ్చినా లేదా తరచూ అనారోగ్య సమస్యలు వచ్చినా మన ఇంట్లోకి దుష్ట శక్తులు వచ్చాయా లేదా ఎవరైనా గిట్టని వారు మనపై చేతబడి చేయించారా అనే అనుమానం చాలా మందికి కల్గుతుంటుంది.అందుకే వేద పండితులు, స్వామీజీల వద్దకు వెళ్లి మన జాతకాలు చెప్పించుకోవడం, తాయత్తులు, యంత్రాలు కట్టించుకోవడం వంటివి చేస్తూ వేలకు వేల డబ్బులను నాశనం చేస్తుంటాం.
కానీ దుష్ట శక్తులు మన ఇంట్లోకి రాకుండా ఉండాలన్నా ఎవారైనా చేతబడి చేసినా మనపై పారకుండా ఉండాలన్నా ఇంట్లో ఉండే కొన్ని పనులు చేయొచ్చు.అయితే ఏం చేయడం ద్వారా ఇంట్లోకి దుష్ట శక్తులు రాకుండా ఉంటాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
ముందుగా ఇళ్లును శుచిగా, శుభ్రంగా ఉంచుకోవాలి.అలాగే ఇంట్లో నిత్యం దీపారాధన చేయాలి.పురుటి స్త్రీని విడిగా ఉంచాలి.ఇంట్లో ఉండే స్త్రీలు ఋతు సమయంలో విడిగా ఉండాలి.
తులసి, నిమ్మ, వేప వంటి చెట్లు ఇంటి ఆవరణలో తప్పకుండా ఉండాలి.అంతే కాకుండా ఇంట్లో రామాయణం, భారతం, భాగవతం, భగవద్గీత వంటి మొదలగు గ్రాంథాలను ఉంచుకోవాలి.
వీలైతే ప్రతి రోజూ వాటిని పారాయణం చేయాలి.పైన చెప్పిన విధంగా ప్రతి రోజూ చేయడం వల్ల ఇంట్లోకి ఎలాంటి దుష్ట శక్తులు అడుగు పెట్టలేవు.
అంతే కాకుండా ఎవరి చెడు చూపు మీ కుటుంబ సభ్యులపై పడదు.అందరూ సంతోషంగా, ఆరోగ్యంగా ఉంటారు.