రీ ఎంట్రీ సినిమా కోసం భారీ రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్న జెనీలియా..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో బొమ్మరిల్లు, రెడీ వంటి చిత్రాల ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నటి జెనీలియా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్నో విజయవంతమైన సినిమాల్లో నటించి నటిగా మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈమె బాలీవుడ్ నటుడు నిర్మాత రితేష్ దేష్ ముఖ్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుని పూర్తిగా సినిమా ఇండస్ట్రీకి దూరమయ్యారు.

 Genelia Huge Remuneration For Movie With Kireeti Reddy Details, Genelia, Tollyw-TeluguStop.com

ఇండస్ట్రీకి దూరమైన జెనీలియా తల్లిగా తన పిల్లల బాధ్యతలను ఎంతో చక్కగా నిర్వర్తించారు.

ప్రస్తుతం తన పిల్లలు పెద్ద కావడంతో తిరిగి ఇండస్ట్రీ లోకి రావాలని ప్రయత్నిస్తున్న నేపథ్యంలోనే ఈమెకు ఆ సినిమాలో నటించే అవకాశం వచ్చింది.

కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి గాలి జనార్దన్ రెడ్డి తనయుడు కిరీటి రెడ్డి హీరోగా రాధాకృష్ణ దర్శకత్వంలో వారాహి చలన చిత్రం బ్యానర్‌పై సాయి కొర్రపాటి నిర్మిస్తున్న సినిమా ద్వారా ఇండస్ట్రీ ఎంట్రీ ఇస్తున్న సంగతి మనకు తెలిసిందే.ఇప్పటికే ఈ సినిమా పూజా కార్యక్రమాలను కూడా పూర్తి చేసుకున్నారు.

ఈ సినిమాలో నటి శ్రీ లీలా, జెనీలియా ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు.

ఈ సినిమా ద్వారా రీ ఎంట్రీ ఇస్తున్న జెనీలియా ఈ సినిమాలో నటించడం కోసం భారీ మొత్తంలో రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

Telugu Galijanardhan, Genelia, Srileela, Kireeti Reddy, Tollywood-Movie

జెనీలియా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న సమయంలో ఒక్కో సినిమాకు 70 లక్షల వరకు రెమ్యూనరేషన్ తీసుకునే ఈమె ప్రస్తుతం రీఎంట్రీ సినిమాకు ఏకంగా మూడు కోట్ల రూపాయలను డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది.ఇక ఈ సినిమాలో జెనీలియా పాత్ర ఎంతో కీలకంగా ఉండటం వల్ల నిర్మాతలు కూడా ఆమె అడిగినంత ఇవ్వడానికి సిద్ధమైనట్టు తెలుస్తోంది.మరి జెనీలియా రెమ్యూనరేషన్ గురించి వస్తున్న ఈ వార్తలలో ఎంత వరకు నిజముందో తెలియాలంటే మేకర్స్ స్పందించాల్సి ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube