ఇంట్లో పకోడీలు, పూరీలు లేదా ఏదైనా వేయించే ఆహార పదార్థాలు తయారు చేసినప్పుడల్లా మిగిలిన నూనెను తిరిగి ఉపయోగించడం చాలమందికి అలవాటు, వంట నూనెల ధరల కారణంగా ఖర్చులు తగ్గించుకునేందుకు అలా చేస్తారు.అయితే ఈ అలవాటే మీ ఆరోగ్యానికి హాని కలిగిస్తుందని మీకు తెలుసా? ఒకసారి ఉపయోగించిన నూనెను పదేపదే ఉపయోగించడం ఆరోగ్యానికి ఎంత హానిచేస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.అలాగే వంట వండాక మిగిలిన నూనెతో ఏమి చేయాలి? ఆ నూనె వాడకం గురించిన ప్రత్యేక విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.వంట నూనెలు మరిగించాక ఆ నూనెలో ట్రాన్స్-ఫ్యాటీ యాసిడ్స్ పరిమాణం పెరగడం మొదలవుతుంది.
ఇది ఆరోగ్యానికి మంచిది కాదని, తిరిగి ఉపయోగించకూడదని వైద్యులు చెబుతుంటారు.
ముఖ్యంగా కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్‌లో స్మోకింగ్ పాయింట్లు చాలా తక్కువగా ఉన్నందున వాటిని మళ్లీ వేడి చేయకూడదు.
మస్టర్డ్ ఆయిల్, రైస్ బ్రాన్ ఆయిల్ మొదలైన వెజిటబుల్ ఆయిల్‌లను మరోమారు.ఉపయోగించవచ్చు.
అయితే అదికూడా అంత మంచిది కాదని నిపుణులు చెబుతుంటారు.ఇంతేకాకుండా మీరు ఒకసారి వాడిన ఆయిల్‌ను మళ్లీ మరిగించి వాడితే అది ఫ్రీ రాడికల్స్‌ను సృష్టిస్తుంది.
ఇటువంటి ఆయిల్ ఎక్కువ కాలం ఉపయోగించడం హానికరంగా పరిణమిస్తుంది.ఈ ఫ్రీ రాడికల్స్ క్యాన్సర్ కారకాలుగా మారుతాయి.ఇవి శరీరంపై ప్రభావం చూపుతాయి.అంతే కాకుండా కొలెస్ట్రాల్ తదితర సమస్యలు పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి.ఒకసారి వాడిన నూనెను పదేపదే వాడటం వలన చాలా మందికి గొంతులో మంట, గుండె సంబంధిత వ్యాధులు కూడా వస్తాయి.నూనెను స్మోకింగ్ పాయింట్ వరకు వేడి చేయవలసిన అవసరం కూడా లేదని నిపుణులు చెబుతుంటారు.