వైరల్: భూగోళంపై అతిపెద్ద ఇగ్లూ కఫే ఇదే..!

కరోనా కారణంగా రెస్టారెంట్స్, హోటళ్ళు చాలా వరకు మూత పడ్డాయి.కానీ ఇప్పుడు కరోనా తగ్గుముఖం పడడంతో మళ్ళీ రెస్టారెంట్లు తిరిగి పూర్వ వైభవాన్ని సంతరించు కుంటున్నాయి.

 This Is The Largest Igloo Cafe On Earth , Igloo Cafe , Viral Latest , News Vira-TeluguStop.com

ఈ క్రమంలోనే పర్యాటకులను ఆకర్షించే దిశగా రెస్టారెంట్ లను డిఫరెంట్ స్టైల్స్ తో ముస్తాబు చేసి ఫుడ్ ప్రియులను ఆకర్షిస్తున్నారు.తాజాగా జమ్మూ కాశ్మీర్‌లోని గుల్మార్గ్‌లో ఇగ్లూ కఫే కూడా పర్యాటకులకు ప్రత్యేక ఆకర్షణగా మారిందనడంలో అతిశయోక్తి లేదనే చెప్పాలి.

మంచుతో నిర్మించబడిన ఈ ఇగ్లూ కేఫ్ చూడడానికి జిల్ ఆకర్షణీయంగా ఉండడంతో పాటు సందర్శకులను కూడా ప్రత్యేకంగా ఆకర్షిస్తుంది.

Telugu Lovers, Hotels, Igloo Cafe, Jammu Kashmir, Syed Wasim Shah, Latest-Latest

అయితే కాశ్మీర్ లోని గుల్మార్గ్ లో గాల ఇగ్లూ కేఫ్ దేశంలేనే మొట్ట మొదటి ఇగ్లూ కేఫ్ గా పేరు సంపాదించు కుంది.కాశ్మిర్ కు వచ్చిన పర్యాటకులను ఆకట్టుకోవడానికి కాశ్మీర్ లోని గుల్మార్గ్ లో ప్రత్యేకంగా ఈ ఇగ్లూ కేఫ్ ను ఏర్పాటు చేయడం జరిగింది.ఈ కేఫ్ 37.5 అడుగుల ఎత్తు, 44.5 అడుగుల వెడల్పుతో నిర్మించడం జరిగింది.అలాగే ఈ కఫే లో ఒకేసారి 40 మంది ఆతిద్యం పొందగలరు.ఇది ప్రపంచంలోనే అతి పెద్ద ఇగ్లూ కఫే అని ఆ కేఫ్ యజమాని అయిన సయ్యద్‌ వసీం షా చెబుతున్నారు.

అంతేకాకుండా గత ఏడాది కూడా ఇలానే 4 టేబుళ్లతో 16 మంది కూర్చునే సామర్థ్యం గల ఇగ్లూ కఫే ఏర్పాటు చేశా అని తెలిపారు.

Telugu Lovers, Hotels, Igloo Cafe, Jammu Kashmir, Syed Wasim Shah, Latest-Latest

అయితే ఇప్పుడు మరింతగా కేఫ్ ను విస్తరించడం జరిగింది అన్నారు.ఇప్పుడు 10 టేబుళ్లతో 40 మంది కూర్చునేలాగా కేఫ్ ను పెంచడం జరిగింది.ఈ ఇగ్లూ కేఫ్ ను దాదాపు 25 మంది 64 రోజుల పాటు పగలు, రాత్రి కష్టపడి మరి ఐదడుగుల మందంతో మంచుతో దీనిని కట్టడం జరిగింది అని చెప్పారు.

ఈ ఇగ్లూ కేఫ్ అనేది ఈసారి మార్చి 15 దాకా కరగకుండా అలానే ఉంటుందని అనుకుంటున్నాం అని, ఆ తర్వాత దీనిని మూసేస్తాం” అని వివరించారు.ఈ కేఫ్ గురించి తెలిసి పలువురు ఆసక్తి చూపడంతో పాటు ఆ కేఫ్ యొక్క ఉష్ణోగ్రతల వివరాలు కూడా అడిగి తెలుసుకుని దానిని సందర్శించేందుకు ప్లాన్ చేసుకుంటున్నారట.

ఎంతయినా మంచులో మంచి భోజనం తినడం అంటే మాటలా చెప్పండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube