వైరల్: భూగోళంపై అతిపెద్ద ఇగ్లూ కఫే ఇదే..!

కరోనా కారణంగా రెస్టారెంట్స్, హోటళ్ళు చాలా వరకు మూత పడ్డాయి.కానీ ఇప్పుడు కరోనా తగ్గుముఖం పడడంతో మళ్ళీ రెస్టారెంట్లు తిరిగి పూర్వ వైభవాన్ని సంతరించు కుంటున్నాయి.

ఈ క్రమంలోనే పర్యాటకులను ఆకర్షించే దిశగా రెస్టారెంట్ లను డిఫరెంట్ స్టైల్స్ తో ముస్తాబు చేసి ఫుడ్ ప్రియులను ఆకర్షిస్తున్నారు.

తాజాగా జమ్మూ కాశ్మీర్‌లోని గుల్మార్గ్‌లో ఇగ్లూ కఫే కూడా పర్యాటకులకు ప్రత్యేక ఆకర్షణగా మారిందనడంలో అతిశయోక్తి లేదనే చెప్పాలి.

మంచుతో నిర్మించబడిన ఈ ఇగ్లూ కేఫ్ చూడడానికి జిల్ ఆకర్షణీయంగా ఉండడంతో పాటు సందర్శకులను కూడా ప్రత్యేకంగా ఆకర్షిస్తుంది.

"""/" / అయితే కాశ్మీర్ లోని గుల్మార్గ్ లో గాల ఇగ్లూ కేఫ్ దేశంలేనే మొట్ట మొదటి ఇగ్లూ కేఫ్ గా పేరు సంపాదించు కుంది.

కాశ్మిర్ కు వచ్చిన పర్యాటకులను ఆకట్టుకోవడానికి కాశ్మీర్ లోని గుల్మార్గ్ లో ప్రత్యేకంగా ఈ ఇగ్లూ కేఫ్ ను ఏర్పాటు చేయడం జరిగింది.

ఈ కేఫ్ 37.5 అడుగుల ఎత్తు, 44.

5 అడుగుల వెడల్పుతో నిర్మించడం జరిగింది.అలాగే ఈ కఫే లో ఒకేసారి 40 మంది ఆతిద్యం పొందగలరు.

ఇది ప్రపంచంలోనే అతి పెద్ద ఇగ్లూ కఫే అని ఆ కేఫ్ యజమాని అయిన సయ్యద్‌ వసీం షా చెబుతున్నారు.

అంతేకాకుండా గత ఏడాది కూడా ఇలానే 4 టేబుళ్లతో 16 మంది కూర్చునే సామర్థ్యం గల ఇగ్లూ కఫే ఏర్పాటు చేశా అని తెలిపారు.

"""/" / అయితే ఇప్పుడు మరింతగా కేఫ్ ను విస్తరించడం జరిగింది అన్నారు.

ఇప్పుడు 10 టేబుళ్లతో 40 మంది కూర్చునేలాగా కేఫ్ ను పెంచడం జరిగింది.

ఈ ఇగ్లూ కేఫ్ ను దాదాపు 25 మంది 64 రోజుల పాటు పగలు, రాత్రి కష్టపడి మరి ఐదడుగుల మందంతో మంచుతో దీనిని కట్టడం జరిగింది అని చెప్పారు.

ఈ ఇగ్లూ కేఫ్ అనేది ఈసారి మార్చి 15 దాకా కరగకుండా అలానే ఉంటుందని అనుకుంటున్నాం అని, ఆ తర్వాత దీనిని మూసేస్తాం'' అని వివరించారు.

ఈ కేఫ్ గురించి తెలిసి పలువురు ఆసక్తి చూపడంతో పాటు ఆ కేఫ్ యొక్క ఉష్ణోగ్రతల వివరాలు కూడా అడిగి తెలుసుకుని దానిని సందర్శించేందుకు ప్లాన్ చేసుకుంటున్నారట.

ఎంతయినా మంచులో మంచి భోజనం తినడం అంటే మాటలా చెప్పండి.

చైనాలో వ్లాగ్ చేస్తూ అతి చేసిన భారతీయ యువతి.. ఫైర్ అవుతున్న నెటిజన్లు..?