రోజురోజుకీ టెక్నాలజీ డెవలప్ అవుతుండడంతో సోషల్ మీడియా వాడకం పెరిగే వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది.టెక్నాలజీ డెవలప్ అవడంతో ప్రపంచం నలుమూలలా ఏం జరిగినా కూడా క్షణాలలో వైరల్ అవుతోంది.
ఎవరు ఏం చేసినా కూడా అందరికీ ఈజీగా తెలిసిపోతుంది.అయితే సోషల్ మీడియాలో కొన్ని రకాల వీడియోలు చూసినప్పుడు కొందరు సపోర్ట్ చేస్తూ ఉంటారు.
కొందరు సపోర్ట్ చేయకపోగా వారిపై నెగిటివ్ గా కామెంట్ చేస్తూ వారి మనసు నొచ్చుకునే విధంగా మాట్లాడుతూ ఉంటారు.ఇక సినీ తారల విషయంలో నెటిజెన్స్ ఏవిధంగా ఉంటారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.సోషల్ మీడియాలో సెలబ్రిటీలు షేర్ చేసే ఫోటోలు, వీడియోల పై కొందరు ఆకతాయిలు మితిమీరిపోయి మరీ కామెంట్స్ చేస్తూ ఉంటారు.మరీ ముఖ్యంగా చెప్పాలంటే హీరోయిన్స్ విషయంలో ఇది ఎక్కువగా జరుగుతూ ఉంటుంది.
తాజాగా బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ కూడా అలాంటి పరిస్థితి ఎదుర్కొన్నాడు.ఇటీవలే హీరో అక్షయ్ కుమార్ ప్రజల ఆరోగ్యం గురించి సలహాలు సూచనలు ఇచ్చిన వీడియో వైరల్ అయిన సంగతి మనందరికీ తెలిసిందే.
అందులో అక్షయ్ కుమార్ జనాలను రోజు వ్యాయామం చేయాలి అని సూచించాడు.అలా చేయడం వల్ల శారీరకంగా మానసికంగా బాగుంటారు అని తెలిపాడు.
అసంపూర్తిగా ఉన్న ఆ వీడియో ఆఖరి లో ప్రతి రోజూ గంట సేపు వ్యాయామానికి కేటాయించాలి లేకపోతే చచ్చిపోండి అనీ అక్షయ్ కుమార్ అనగా ఆ మాటలపై నెటిజెన్స్ తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.దీనితో అక్షయ్ కుమార్ పై ట్రోల్స్ చేయడం మొదలుపెట్టారు.కొందరు తండ్రులు ఇలాగే మాట్లాడుతారు.కొందరు ఉపాధ్యాయులు కూడా ఇదే విధంగా మాట్లాడతారు.అంటూ కామెంట్ చేస్తున్నారు.మొత్తానికి ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.