చిన్న పిల్లలు పాన్ ఇండియా స్టార్స్ అవుతున్నారు అంటూ పవన్ కళ్యాణ్ పై ఆర్జీవీ సెటైర్స్!

టాలీవుడ్ వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఏదో ఒక వార్త ద్వారా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నారు.ఈ క్రమంలోనే తాజాగా వర్మ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేస్తూ అతని పై సెటైర్ వేశారు.

 Ram Gopal Varma Tweets On Pawan Kalyan Details, Ram Gopal Varma, Pawan Kalyan,-TeluguStop.com

ఈ క్రమంలోనే వర్మ స్పందిస్తూ ఒకప్పుడు సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా హిందీలో విడుదల చేయొద్దని ట్విటర్ సాక్షిగా చెప్పినా పవన్ కళ్యాణ్ వినలేదు.ఆ సినిమా ఫలితం ఎలా ఉందో అందరికీ తెలిసిందే.

అయితే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ నటిస్తున్న భీమ్లా నాయక్ సినిమాని పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయాలని సూచించారు.

ఆంధ్రాలో జరిగిన ఒక సంఘటన ఆధారంగా తెరకెక్కిన పుష్ప సినిమా అంత పెద్ద మొత్తంలో కలెక్షన్లు రాబడితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఈ సినిమా ఏ స్థాయిలో ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

అందుకే మీరు నటిస్తున్న ఈ సినిమాని ఇండియా స్థాయిలో విడుదల చేసి మీరు ఏంటో ప్రూవ్ చేసుకోవాలని పవన్ కళ్యాణ్ కి సూచించారు.ఇలా మీ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదల కాకపోతే అల్లు అర్జున్ అభిమానులకు మీ అభిమానులుగా మేము ఏం సమాధానం చెప్పాలి అంటూ ప్రశ్నించారు.

ఒకప్పుడు అల్లు అర్జున్ గురించి నేను చేసిన ట్వీట్లు వోడ్కా టైంలో చేసినవి, కానీ మీ గురించి చేసే ఈ ట్వీట్ కాఫీ టైం లో చేస్తున్నాను అంటూ చెప్పుకొచ్చారు.మీ కన్నా వెనక వచ్చిన పిల్లలు పాన్ ఇండియా స్టార్స్ గా పేరు సంపాదించుకున్నారు.మీరు ఇంకా ఈ తెలుగులో మాత్రమే నటిస్తూ ఉన్నారు.దయచేసి మీ భీమ్లా నాయక్ సినిమాని పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయండి అంటూ వర్మ పవన్ కళ్యాణ్ గురించి చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

వర్మ చేసిన ఈ ట్వీట్ పై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తూ సెటైర్లు వేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube