కంగానా బుగ్గలను దాంతో పోల్చిన ఎమ్మెల్యే.. ఏం జరిగిందంటే?

జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే డాక్టర్ ఇర్ఫాన్ అన్సారీ ఇటీవలే నటి హేమ అందంపై నటి కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే.తాజాగా మరొకసారి బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్ బుగ్గలపై కామెంట్స్ చేశారు.

 Jharkhand Congress Mla Dr Irfan Ansari Has Promised That Roads In His Constituen-TeluguStop.com

జార్ఖండ్ లోని జమ్ తారా నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న విషయం అందరికి తెలిసిందే.అన్సారీ అతనే స్వయంగా రికార్డు చేసుకున్న ఒక సెల్ఫీ వీడియోలో కొత్త రోడ్ల గురించి ప్రస్తావించాడు.

ఈ క్రమంలోనే సరి కొత్త బాటలు ఎంత నున్నగా ఉన్నాయి అంటే కంగనా బుగ్గల కంటే బాగుంటాయి అని చెప్పుకొచ్చాడు.

అలాగే వాటిపై గిరిజనుల పిల్లలు, ఇతరులు కూడా హాయిగా ప్రయాణించవచ్చు అని తెలిపాడు.

త్వరలోనే 14 ప్రపంచ స్థాయి రోడ్ల నిర్మాణం జమ్ తారా నియోజకవర్గంలో మొదలవుతుంది అనే అన్సారీ ప్రకటించారు.అయితే ఇలా వివాదాలలో చిక్కుకోవడం ఇదే మొదటిసారి కాదు.

ఇప్పటికే పలు సార్లు ఇలా కామెంట్స్ చేస్తూ వివాదాలలో చిక్కుకున్న విషయం తెలిసిందే.ఎంబిబిఎస్ చదువుకున్న ఇర్ఫాన్ అన్సారీకి వివాదాలు కొత్త కాదు.

ఆ మధ్య ఒక సారి అతిగా మాస్కు ధరించ వద్దు అని ప్రకటించిన విషయం తెలిసిందే.

Telugu Hema, Jharkhand, Kangana, Roads-Movie

ఒక వైద్యుడు గా చెబుతున్నాను అంటూ తెలపగా ఆ విషయం కాస్త దుమారమే రేపింది.ఇక ఒక ప్రోగ్రామ్ లో పాల్గొన్న అతను మాస్కు ధరించక పోగా మాస్క్ మరీ అంత అవసరం లేదు అంటూ తనని తాను సమర్థించుకున్నాడు కూడా.ఈ విషయంపై నెటిజన్స్ అతన్ని ఏకిపారేశారు.

కంగనా రనౌత్ బుగ్గలతో రోడ్లని పోల్చిన జార్ఖండ్ ఎమ్మెల్యేకి మహారాష్ట్ర నేత గులాబ్ రావు పాటిల్ ఇన్స్పిరేషన్ అని చెప్పవచ్చు.గతంలో హేమమాలిని బుగ్గలతో తమ రోడ్లని పోల్చుకున్న విషయం తెలిసిందే.

ఆ తర్వాత హీరోయిన్ కు సారీ కూడా చెప్పినప్పటికీ.ప్రస్తుత రోజుల్లో హీరోయిన్స్ అందాన్ని ప్రస్తావిస్తూ పొలిటిషియన్స్ కామెంట్ చేయడం ట్రేండింగ్ గా మారింది అని చెప్పవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube