19 ఏళ్లు వచ్చేవరకు నాన్నను చూడలేదు.. నటి ఐశ్వర్య సంచలన వ్యాఖ్యలు!

అందం, నటనతో లక్ష్మీ కూతురు ఐశ్వర్య ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు.దాదాపు 30 సంవత్సరాల నుంచి ఐశ్వర్య నటిగా ఇండస్ట్రీలో కేరీర్ ను కొనసాగిస్తున్నారు.

 Actress Aishwarya Shocking Comments About Her Father , Aishwarya, Father , Inter-TeluguStop.com

తెలుగు, తమిళంతో పాటు ఇతర భాషల్లో సైతం ఐశ్వర్య నటిగా గుర్తింపును సంపాదించుకున్నారు.తాజాగా అలీతో సరదాగా షోలో పాల్గొన్న ఐశ్వర్య తన హైట్ 5.9 అడుగులు అని చెప్పారు.ఒక కావ్య మూవీతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చానని ఆమె చెప్పుకొచ్చారు.

ఎన్ని సినిమాలలో నటించానో గుర్తు లేదని 50కు పైగా సినిమాలలో నటించానని అనుకుంటున్నానని ఐశ్వర్య చెప్పుకొచ్చారు.తన భర్తతో విడాకులు అయ్యాయని కూతురు జర్నలిజం అండ్ కార్పొరేట్ రంగంలో ఉందని ఐశ్వర్య పేర్కొన్నారు.

ఒక డైరెక్టర్ తన సహనాన్ని పరీక్షించాడని ఆ డైరెక్టర్ డైరెక్షన్ లో నటించడానికి తనకు ఇష్టం లేదని ఆయన కాకుండా మిగతా డైరెక్టర్లు అంతా తనకు గురువులే అని ఐశ్వర్య చెప్పుకొచ్చారు.

సినిమా రంగంలో స్నేహితులమని చెప్పుకున్నా స్నేహ బంధం ఉండదని ఐశ్వర్య పేర్కొన్నారు.

తాను కరాటేలో బ్లాక్ బెల్ట్ సాధించానని వాయిస్ కొంతమంది మైనస్ అని చెప్పినా తాను ప్లస్ గా భావిస్తానని ఐశ్వర్య చెప్పుకొచ్చారు.ఫోన్ చేసి ఎక్కడ ఉన్నావని అడిగితే అస్సలు నచ్చదని ఆమె చెప్పుకొచ్చారు.

ఒకటిన్నర సంవత్సరాల వయస్సులోనే నాన్న, అమ్మ విడిపోయారని అమ్మమ్మే నన్ను పెంచిందని ఐశ్వర్య అన్నారు.

Telugu Aishwarya-Movie

19 సంవత్సరాల వయస్సు వచ్చేవరకు నాన్నను చూడలేదని ఒక ఇంటర్వ్యూలో నాన్నను కలవాలనుకుంటున్నానని చెప్పగా నాన్న సహోద్యోగి మా నాన్న వివరాలను ఇచ్చారని ఐశ్వర్య అన్నారు.టాలీవుడ్ నుంచి మూవీ ఆఫర్లు వచ్చినా రెగ్యులర్ గా రావని ఆమె తెలిపారు.పూరీ జగన్నాథ్ ప్రకాష్ రాజ్ సూచన మేరకు అమ్మానాన్న ఓ తమిళ అమ్మాయి సినిమాలో ఛాన్స్ ఇచ్చారని సీనియర్ ఎన్టీఆర్ తన దృష్టిలో దేవుడని ఆమె చెప్పుకొచ్చారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube