ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):
సూర్యోదయం: ఉదయం 06.23
సూర్యాస్తమయం: సాయంత్రం 05.28
రాహుకాలం: మ.03.30 నుంచి 04.30 వరకు
అమృత ఘడియలు: మ.04.00 నుంచి 06.00 వరకు
దుర్ముహూర్తం: ఉ.08.24 నుంచి 09.12 వరకు
ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):
మేషం:
ఈ రోజు మీరు ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా సాగుతుంది.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.మీ భాగస్వామితో కలిసి కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తుంటారు.మీరు పనిచేసే చోట ఇతరులకు సహాయం చేస్తారు.
వృషభం:
ఈరోజు మీరు అనుకున్న సమయానికంటే త్వరగా పనులు పూర్తి చేస్తారు.మీ భాగస్వామి నుండి శుభవార్త వింటారు.సమాజంలో మంచి గౌరవం అందుకుంటారు.
ఇక్కడి ముఖ్యమైన విషయాల గురించి అనుభవం ఉన్న వ్యక్తులతో మాట్లాడాలి.సమయాన్ని కాపాడుకోవాలి.
మిథునం:
ఈరోజు మీరు ఆర్థికంగా ఎక్కువ లాభాలు అందుకుంటారు.కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు ఆలోచించాలి.వ్యక్తిగత విషయాలను ఇతరులతో ఎక్కువగా పంచుకోకూడదు.అనవసరమైన విషయాల గురించి చర్చలు చేయటం వల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు.
కర్కాటకం:
ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయటం మంచిది.ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి.కొన్ని నిర్ణయాలు మీకు అనుకూలంగా ఉంటాయి.కొత్త పనులు ప్రారంభించడానికి ఈ రోజు అనుకూలంగా ఉంది.వ్యాపారస్తులు అనవసరంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.
సింహం:
ఈరోజు మీరు మీ భాగస్వామితో కలిసి కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.దీనివల్ల సంతోషంగా ఉంటారు.బంధువుల నుండి శుభవార్త వింటారు.
ఆరోగ్యం అనుకూలంగా ఉంది.కుటుంబ సభ్యులతో వాదనలకు దిగకండి.నిరుద్యోగులు ఉద్యోగం కోసం ప్రయత్నించాలి.
కన్య:
ఈరోజు మీరు ఆర్థికంగా ఇతరులకు సహాయం చేస్తారు.కొన్ని నిర్ణయాలు తీసుకునే ముందు ఆలోచనలు చేయాలి.ఇతరులతో మాట్లాడే ముందు తొందర పడకూడదు.
సమాజంలో మంచి గౌరవాన్ని అందుకుంటారు.మీ పిల్లల భవిష్యత్తు గురించి బాగా ఆలోచించాలి.
తులా:
ఈరోజు మీరు తీరికలేని సమయంతో గడుపుతారు.అనవసరమైన విషయాల గురించి బాగా ప్రచారం చేస్తారు.దీని వల్ల ఎవరికి ఉపయోగం ఉండదు.మీ తోబుట్టువులతో కొన్ని ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.మీరు పనిచేసే చోట ఒత్తిడిగా ఉంటుంది.
వృశ్చికం:
ఈరోజు మీరు కొన్ని ప్రయాణాలు చేయకపోవడం మంచిది.అనవసరమైన ఖర్చులు ఎక్కువగా చేయకూడదు.ఇతరులు మీ సొమ్మును తిరిగి ఇవ్వటంలో ఆలస్యం చేస్తారు.
అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.సమయాన్ని కాపాడుకోవాలి.
ధనస్సు:
ఈరోజు నుండి మీరు జాగ్రత్తగా ఉండాలి.ఆర్థిక విషయంలో తొందర పడకూడదు.అనుకోకుండా కొన్ని దూర ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.శత్రువులకు దూరంగా ఉండాలి.ఇతరులతో మాట్లాడే ముందు బాగా ఆలోచించాలి.మీరు పనిచేసే చోట సమయాన్ని కాపాడుకోవాలి.
మకరం:
ఈరోజు మీరు ఆర్థికంగా ఎక్కువ లాభం అందుకుంటారు.ఇంటికి సంబంధించిన విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.ఇతరులు మీ సొమ్మును తిరిగి ఇవ్వగలరు.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో తొందర పడకూడదు.మీరు పని చేసే చోట అనుకూలంగా ఉంది.
కుంభం:
ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేస్తారు.కొన్ని విషయాల గురించి తల్లి దండ్రులతో చర్చలు చేస్తారు.ఇతరులతో మాట్లాడే ముందు బాగా ఆలోచించాలి.
అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచనలు చేయకండి.సమయాన్ని కాపాడుకోవాలి.
మీనం:
ఈరోజు మీరు తీసుకునే నిర్ణయం బట్టి భవిష్యత్తు ఉంటుంది.ఇతరులతోవాదనలకు దిగకండి.అనుకున్న పనులన్నీ ఈ రోజు పూర్తి చేస్తారు.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో తొందర పడకూడదు.మీరు పనిచేసే చోట అనుకూలంగా ఉండే అవకాశం ఉంది.
LATEST NEWS - TELUGU