'ఆదిపురుష్‌' టీజర్ రిలీజ్ కి కూడా అదే సెంటిమెంట్‌.. ఇంతకు అదేంటి భయ్యా?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన ఆదిపురుష్‌ సినిమా వచ్చే ఏడాది జనవరిలో సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే.భారీ అంచనాలున్న ఆదిపురుష్‌ సినిమా టీజర్ ని రేపు దసరా కానుకగా విడుదల చేయబోతున్న విషయం తెలిసిందే.

 Prabhas Adipurush Movie Teaser Release Time Details, Adipurush, Adipurush Movie-TeluguStop.com

అందుకు సంబంధించిన పోస్టర్ ఇప్పటికే విడుదల అయ్యి అంచనాలను ఆకాశానికి పెంచేసింది.రేపు అయోధ్యలో భారీ ఎత్తున జరగబోతున్న ఈవెంట్ కోసం ఇప్పటికే ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి.

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్య నాథ్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చే అవకాశం ఉందంటూ వార్తలు వస్తున్న నేపథ్యం లో అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలుస్తుంది.

 Prabhas Adipurush Movie Teaser Release Time Details, Adipurush, Adipurush Movie-TeluguStop.com

మీడియా వారికి ఎక్కువగా ఆహ్వానం లేదు, తెలుగు మీడియాను ఆహ్వానించ లేదు.

హిందీ కి సంబంధించిన కొద్ది మంది మీడియా వారిని ఆహ్వానించబోతున్నారు.రేపు సాయంత్రం జరగబోతున్న భారీ ఈవెంట్ లో ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఈ టీజర్ ని విడుదల చేయబోతున్నారు.

దాదాపు రెండు నిమిషాల నిడివి ఉండే ఈ టీజర్ కి సంబంధించిన విజువల్స్ కొన్ని సోషల్ మీడియాలో లీక్ అయ్యాయి, అవి అంచనాలు భారీగా పెంచాయి.

ఇక యూట్యూబ్ లో టీజర్ ఎప్పుడెప్పుడు చూస్తామా అని ఎదురు చూస్తున్న వారికి గుడ్ న్యూస్.రేపు సాయంత్రం 7 గంటల 11 నిమిషాలకు ఆదిపురుష్‌ టీజర్ ని యూట్యూబ్ ద్వారా ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు.ఇప్పటి వరకు ఆదిపురుష్‌ సంబంధించిన ప్రతి ఒక్క అప్డేట్ ఉదయం 7 గంటల11 నిమిషాలకు దర్శకుడు ఇచ్చాడు.

ఈ సారి మాత్రం టీజర్ ని సాయంత్రం 7 గంటల 11 నిమిషాలకు ఇవ్వబోతున్నాడు.ఇంతకు ఈ 7 గంటల 11 నిమిషాల సెంటిమెంట్ ఏంటో కానీ అందరి దృష్టిని ఆకర్షిస్తుంది.

రేపు టీజర్ సంచలన రికార్డులు నమోదు చేసేలా వ్యూస్ దక్కించుకునే అవకాశం ఉంది.

Video : Prabhas Adipurush Movie Teaser Release Time Details, Adipurush, Adipurush Movie Teaser, Prabhas, Up Cm, Adipurush Teaser Release Time, Prabhas Adipurush Movie, Kriti Sanon, Om Raut #TeluguStopVideo

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube