ఎరుపురంగులో కాస్తున్న చింత‌కాయ‌లు.. కార‌ణం వారి ర‌క్త‌మే అంటున్న స్థానికులు

చింత కాయ‌లు అంటే తెలియని వారు ఉండ‌రు.సాధార‌ణంగా చింత‌కాయ‌లు అంటే ఆకుపచ్చని లేదంటే తెల్లని రంగులో చింత‌కాయ‌లు ఉంటాయి.

 Chintakayas In Red The Reason Is That The Locals Say Their Blood, Chintakayas, V-TeluguStop.com

ఇక వీటి రుచి కూడా పులుపుగా ఉంటుంద‌ని అంద‌రికీ తెలిసిందే.అయితే ఇప్పుడు మీకు ఓ డిఫ‌రెంట్ చింత‌కాయ గురించి చెప్ప‌బోతున్నాం.

ఇ చింత‌కాయ‌లు ఎర్రగా అది కూడా రక్తం మాదిరిగా ఉంటున్నాయి.వాస్త‌వానికి చింత‌కాయ‌లు ఇలాంటి రంగులో ఉండవు.

అయితే ఈ ఎర్ర‌ని చింత‌కాయ‌ల‌ను తిన్న వారి నోరు కూడా పూర్తిగా ఎర్రగా మారిపోతుంది.పులుసు చేసినా కూడా చివ‌ర‌కు అది రక్తం రంగులో కనబడుతుంది.

ఇక మ‌రో విష‌యం ఏంటంటే ఈ చింతకాయల‌ను తింటే సేమ్‌ రక్తం వాసన వస్తోందని తెలుస్తోంది.మ‌రి ఇంత డిఫ‌రెంట్ చింతకాయలు ఎక్కడున్నాయో తెలుసుకోవాల‌ని మీకు కూడా ఉంటుంది క‌దూ.

అయితే దాన్ని తెలుసుకోవాలంటే క‌చ్చితంగా నల్లమల ప్రాంతానికి అంద‌రూ వెళ్లాల్సిందే.ఈ చింత చెట్టు నాగర్ కర్నూల్ జిల్లాలోని బల్మూర్ మండలానికి చెందిన‌ మైలారం గ్రామంలో ఉంద‌ని స‌మాచారం.

అయితే ఈ మైలారం గ్రామం మారుమూలలే అయినా కూడా ఇక్క‌డ పురాతన కట్టడాలు మాత్రం అనేకం ఉన్నాయి.

ఇక ఈ గ్రామంలో ఉండే వింత చింతచెట్టు ఉంది.

ఇక్క‌డ మ‌రో విశేషం ఏంటంటే ఆ చింతచెట్టు కింద‌నే ముస్లీముల సమాధులు ఉండ‌టం గ‌మనార్హం.ఈ ప్రాంతంలో ఉన్న మిగ‌తా చింతచెట్లకు సాధార‌ణ కాయ‌లు కాస్తుంటాయి.

కానీ ఈ చింతచెట్టే ఇలా ఎర్ర‌టి కాయ‌ల‌ను కాస్తోంది.కాగా రాణీరుద్రమా దేవి మనవడు అయిన ప్రతాపరుద్రుడు రాజుగా ఉన్న‌ప్పుడు త‌న ఖ‌జానాను ఈ ఊరిలోని మ‌స‌మ్మ గుడి ద‌గ్గ‌ర దాచేవాడ‌ని, కాగా వీటికి గ్రామానికి చెందిన కొంద‌రు ముస్లీంల‌నే కాప‌లాగే ఉంచేవార‌ని, కానీ శ‌త్రువులు వారిని చంపి చింత‌చెట్టు కింద స‌మాధి చేశార‌ని చెబుతున్నారు.

ఇక వారి స‌మాధుల నుంచి మొలిచిన చింత‌చెట్టు ఇలా వారి ర‌క్తం వ‌ల్ల‌నే ఎరుపు రంగు చింత‌కాయ‌ల‌ను కాస్తోంద‌ని క‌ట్టు క‌థ‌లు ఉన్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube