ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రాజధాని కి సంబంధించి గందరగోళం నెలకొన్న సంగతి తెలిసిందే.చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో అమరావతిని ఏకైక రాజధాని అని ప్రకటించగా తరువాత జగన్ అధికారంలోకి వచ్చి మూడు రాజధానులు తెరపైకి తీసుకురావటం తెలిసిందే.
ఈ క్రమంలో అమరావతిని శాసన రాజధానిగా అదేరీతిలో కర్నూలు రాజధానిగా విశాఖపట్నాన్ని పరిపాలన రాజధానిగా చేస్తున్నట్లు నిర్ణయం తీసుకోవడం జరిగింది.ఈ క్రమంలో తెలుగుదేశం పార్టీ నేతలు అమరావతి రాజధానిగా ఉంచాలని… కోరటం మాత్రమే కాక రాజధాని కోసం భూములిచ్చిన రైతులతో దీక్షలు కూడా చేస్తున్నారు.
ఇదే క్రమంలో మరికొన్ని పార్టీలు కూడా మూడు రాజధానులు అంశాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.పరిస్థితి ఇలా ఉండగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ఏపీ రాజధాని అంశం పై సంచలన వ్యాఖ్యలు చేశారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి ఎక్కడ ఉంటే అదే రాజధాని అని పేర్కొన్నారు.అది పులివెందల అయినా.
విజయవాడ అయినా లేకపోతే సీఎం ఎక్కడ ఉంటే అక్కడే రాజధాని అనుకోవాలని స్పష్టం చేశారు.అంత మాత్రమే కాక ముఖ్యమంత్రి నివాసం ఎక్కడ ఉంటే అక్కడే రాజధాని మరియు సెక్రటేరియట్ అని అన్నారు.
సీఎం జగన్ శ్రీభాగ్ ఒప్పందం ప్రకారం మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్నట్లు… ముఖ్యమంత్రి జగన్ నిర్ణయానికి వైసిపి ప్రజాప్రతినిధులంతా కట్టుబడి ఉన్నట్లు మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి స్పష్టం చేశారు.