మంచు లక్ష్మీ.డైలాగ్ కింగ్ మోహన్ బాబు ముద్దుల కూతురు.
ఎక్కువ కాలం అమెరికాలోనే గడిపిన ఈ ముద్దుగుమ్మ.ఆ తర్వాత ఇండియాకు వచ్చి సినిమా పరిశ్రమలో అడుగు పెట్టింది.
పలు సినిమాల్లో నటించి మంచి గుర్తింపు పొందింది.అయితే అనుకున్న స్థాయిలో సినిమా రంగంలో ఆమె ముందుకు సాగలేదు.
కొంత కాలం బుల్లితెరపై పలు షోలు చేసింది.మంచి గుర్తింపు పొందింది.
ప్రస్తుతం అడపాదడపా సినిమాల్లో చేస్తూనే ఉంది.తాజాగా ఈ అమ్మడు అలీతో సరదాగా అనే షోలో పాల్గొంది.తన చిన్నప్పటి సంగతుల గురించి వివరించింది.తన తమ్ముళ్లతో ఎలా ఉండేది? ఎలా అల్లరి చేసేవాళ్లు? ఎలా కొట్లాడుకునే వారు? అనే విషయాలను చెప్పింది.చిన్నప్పుడ తమ్ముడు విష్ణుతో జరిగిన గొడవ గురించి కూడా వివరించింది.చిన్నప్పుడు విష్ణుతో కలిసి చాలా అల్లరి చేసినట్లు వెల్లడించింది.అయితే ఓ సారి ఇద్దరి మధ్య గొడవ అయ్యిందట.ఒకరిపై మరికొరికి విపరీతమైన కోపం వచ్చిందట.
పక్కనే ఉన్న చెక్క తీసుకుని ముందుకు విష్ణు తలమీద కొట్టిందట లక్ష్మీ.అదే చెక్క తీసుకుని లక్ష్మీ తల మీద బాదాడట విష్ణు.
దీంతో తన తలపై పెద్ద గాయం అయినట్లు వెల్లడించింది.అంతేకాదు.
ఈ దెబ్బకు ఐదారు కుట్లు కూడా పడ్డాయట.
విష్ణు అక్కను కొట్టగానే.పెద్ద గాయం కావడంతో భయపడి పోయాడట.తండ్రి కొడతాడని భావించి వెంటనే హైదరాబాద్ కు రావాలనుకున్నాడట.
తన తాతో కలిసి వెళ్దాం అని వేడుకున్నాడట.అయితే తాను మోహన్ బాబుకు చెప్తానని తాత హామీ ఇవ్వడంతో వెనక్కి తగ్గాడట.
ఇంటికి వచ్చిన మోహన్ బాబుకు.విష్ణు వాళ్ల తాతయ్య నిదానంగా విషయం చెప్పాడట.
తన్నులు తప్పవు అనుకున్న విష్ణు ఆ గండం నుంచి బయటపడ్డాడట.అప్పటికే లక్ష్మీని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లి ఆమె తలకు కుట్లు వేయించారట.
మళ్లీ ఇలాంటి ఘటనలు జరగకూడదని మోహన్ బాబు ఇద్దరికీ వార్నింగ్ ఇచ్చి వదిలేశాడట.