ఒకప్పుడు తెలుగు సినిమా పరిశ్రమలో మకుటం లేని మహరాజుగా వెలుగు వెలిగిన నటుడు చిరంజీవి.తన సినిమా కెరీర్ పీక్స్ లో ఉండగానే.
ఆయన సినిమా రంగాన్ని వదిలి పెట్టి రాజకీయ రంగంలోకి అడుగు పెట్టాడు.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అధికారంలోకి రావడమే లక్ష్యంగా ప్రజారాజ్యం పార్టీని స్థాపించాడు.
అన్ని అసెంబ్లీ స్థానాల్లో తమ పార్టీ అభ్యర్థులను పోటీకి దింపాడు చిరంజీవి.అయితే ఆయన అనుకున్న ఫలితాలు ఆ ఎన్నికల్లో రాలేదు.290కి పైగా స్థానాల్లో పోటీకి దిగితే కేవలం ఆయన పార్టీ 18 చోట్ల మాత్రమే విజయం సాధించింది.ఆ తర్వాత పార్టీని కాంగ్రెస్ లో కలపడం.
ఆయన కేంద్రమంత్రి కావడం.ఆ తర్వాత కాంగ్రెస్ సర్కారు పోవడం.
ఆయన రాజీకాయాలకు గుడ్ బై చెప్పి మళ్లీ సినిమా రంగంలోకి రావడం జరిగిపోయాయి.అయితే తన రీ ఎంట్రీ తర్వాత.
ఆయన గతంలో మాదరిగా సత్తా చాటలేకపోతున్నాడు అనే విమర్శలు వస్తున్నాయి.ఇంతకీ ఆ విమర్శలకు కారణం ఏంటో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
నిజానికి సినిమా రంగంలోకి మళ్లీ ఎంట్రీ ఇచ్చాక.ఆయన తీసుకునే నిర్ణయాలతో పాటు సెలెక్ట్ చేసుకునే కథలు సైతం అంత పక్కాగా ఉండటం లేదు.ఒదాని తర్వాత మరొక సినిమా అయితే చేస్తున్నాడు కానీ.ఆయన సినిమాలు జనాల్లోకి అంతలా వెళ్లడం లేదనేది వాస్తవం.
ఇక్కడి దర్శకుల మీద కూడా ఆయనకు నమ్మకం కలగడం లేదనే విమర్శలు కూడా కలుగుతున్నాయి.ఆయన తాజాగా చేస్తున్న సినిమాల్లో ఎక్కువగా రీమేక్ సినిమాలే ఉన్నాయి.
ఆయన సరే అంటే అద్భుతమైన కథలతో తెలుగు దర్శకులు రెడీ ఉంటారు.కానీ.
చిరంజీవి మాత్రం రీమేక్ మూవీస్ వైపే మొగ్గు చూపుతున్నాడు.గతంలో మాదిరిగా రిస్క్ తీసుకోవడం ఎందుకు అనుకుంటున్నట్లు చాలా మంది భావిస్తున్నారు.
దశాబ్దం తర్వాత ఆయన చేసిన ఖైదీ నెంబర్ 150 సినిమా తమిళ మూవీ కత్తికి రీమేక్.సైరా నర్సింహారెడ్డి కూడా ఉయ్యాలవాడ జీవిత చరిత్ర ఆధారంగానే తీశారు తప్ప.సొంత స్టోరీ కాదు.తాజాగా ఆయన చేస్తున్న ఆచార్య మాత్రమే కొరటాల సొంతంగా తయారు చేసుకున్న కథతో సినిమాను తెరకెక్కిస్తున్నాడు.అనంతరం ఆయన చేయబోయే లూసీఫర్ సినిమా సైతం గాడ్ ఫాదర్ రీమేక్ సినిమానే.వేదాళం సినిమాను సైతం భోళా శంకర్ పేరుతో రీమేక్ చేస్తున్నారు.
అటు అజిత్ హీరోగా చేసిన ఎన్నై అరింధాల్ సినిమాను సైతం తెలుగులో రీమేక్ చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.చిరంజీవి లాంటి స్టార్ హీరో రీమేక్ సినిమాల పైనే ఆధారపడటం మంచిది కాదనే వాదన వినిపస్తోంది.