టాలీవుడ్ లో కొత్త దర్శకుల హవా మొదలైంది.ఎస్ఆర్ఆర్, త్రివిక్రమ్, వినాయక్ లాంటి సీనియర్ దర్శకులని పక్కన పెడితే.
సంకల్ప్, సందీప్, వివేక్ ఆత్రేయ, సుజీత్ లాంటి యంగ్ అండ్ న్యూ డైరెక్టర్స్ ప్రాజెక్టులకు మంచి డిమాండ్ ఉంది.న్యూ డైరక్టర్స్ హవా ఎంత ఉన్నా.
సీనియర్ దర్శకుల మార్క్ సినిమా ఒక్కటి పడితే చాలు ఆ రిజల్ట్ ఎలా ఉంటుందో చాలా సార్లు నిరూపణ అయ్యింది.కొందరు సీనియర్, ఫామ్ లో లేని డైరెక్టర్స్ వారి కొత్త ప్రాజెక్టులతో వస్తున్నారు.ఇంతకీ వారెవరో చూద్దాం.
బోయపాటి-బాలయ్య
వినయ విధేయ రామ సినిమాతో పెద్ద డిజాస్టర్ ఇచ్చాడు బోయపాటి.తాజాగా బాలయ్యతో కలిసి అఖండ అనే సినిమా చేస్తున్నాడు.ఈ సినిమా ఎలా ఉంటుందో చూడాలి.
క్రిష్-పవన్ కల్యాణ్
ఎన్టీఆర్ బయోపిక్ తో అనుకున్న విజయం సాధించలేని క్రిష్ పవన్ తో చేస్తున్న మూవీతో విజయం సాధిస్తాడేమో చూడాలి.
శ్రీను వైట్ల
ఢీ, దూకుడు, బాద్షా లాంటి సూపర్ హిట్ సినిమాలు చేసిన ఈయన.మళ్లీ అలాంటి సినిమాతో హిట్ సాధించాలి అనుకుంటున్నాడు.
శ్రీకాంత్ అడ్డాల-నారప్ప
క్లాస్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ అయిన శ్రీకాంత్.చాలా రోజుల తర్వాత అసురం రీమేక్ చేస్తున్నాడు.వెంకీ హీరోగా నారప్ప పేరుతో ఈ సినిమ తెరకెక్కుతోంది.
హను రాఘవపూడి-దుల్కర్
రొమాంటిక్ లవ్ స్టోరీస్ చేసే హను.పడిపడిలేచె వయసు పెద్ద దెబ్బకొట్టింది.ప్రస్తుతం వైజయంతి బ్యానర్ లో దుల్కర్ తో చేసే మూవీ హిట్ అవుతుందో.లేదో చూడాలి.
వినాయక్
ఆది, ఠాగూర్, అదుర్స్ లాంటి సినిమాలు తీసిన వినాయక్ ప్రస్తుతం ఏ ప్రాజెక్టు చేయడం లేదు.
మెహర్ రమేష్-వేదాళం రీమేక్
ప్రస్తుతం మెహర్ వేదాళం రీమేక్ చేస్తున్నాడు.చాలా కాలంగా హిట్ లేకుండా ఇబ్బంది పడుతున్న ఆయనను ఈ మూవీ ఏం చేస్తోందో చూడాలి.
చంద్ర శేఖర్-చెక్
చక్కటి కథతో సినిమాలు చేసే చంద్ర తాజాగా నితిన్ తో చెక్ సినిమా చేశాడు.ఇది అంతంత మాత్రంగానే ఆడింది.
క్రిష్ణ వంశీ- రంగ మార్తాడం
గత కొన్ని సినిమాలు ఫ్లాఫ్ గా ఉన్న ఈ దర్శకుడు రమ్య క్రిష్ణతో రంగ మార్తాండ చేస్తున్నాడు.ఈ మూవీ ఎలా ఉంటుందో చూడాలి.
సంపత్ నంది-సీటీమార్
రచ్చ, గౌతమ్ నంద సినిమాలు చేసిన సంపత్.గోపీచంద్ హీరోగా సీటీమార్ సినిమా చేస్తున్నాడు.ఎలాంటి రిజల్ట్ వస్తుందో చూడాలి.