కరోనాపై పోరు... మీకు మేమున్నాం: భారత్‌ కోసం ఏకతాటిపైకి 40 అమెరికన్ కంపెనీలు

కరోనా సెకండ్ వేవ్‌తో చిగురుటాకులా వణికిపోతోంది ఇండియా.గతంలో ఎన్నడూ లేని విధంగా భారతదేశ ఆరోగ్య వ్యవస్థకు, సత్తాకు వైరస్ సవాల్ విసురుతోంది.

 Ceos Of 40 Us Companies Create Global Task Force To Help India Fight Covid, Indi-TeluguStop.com

ప్రతిరోజూ 3 లక్షలకు పైగా కేసులు, 2 వేలకు పైగా మరణాలతో ప్రపంచంలోనే భారత్ నెంబర్‌వన్ స్థానంలో నిలుస్తోంది.దేశంలో ఏ మూల చూసినా ఆసుపత్రుల్లో కరోనా రోగులు.

విరామం లేకుండా కాలుతున్న చితి మంటలే కనిపిస్తున్నాయి.తమ వారిని ఆసుపత్రుల్లో చేర్చుకోవాలంటూ రోగుల బంధువులు చేస్తున్న ఆర్తనాదాలు కంటతడి పెట్టిస్తున్నాయి.

వైరస్‌ను కట్టడి చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు శతవిధాలా ప్రయత్నిస్తున్నాయి.పలు చోట్ల లాక్‌డౌన్, నైట్‌కర్ఫ్యూలను విధించినప్పటికీ మహమ్మారి ఉద్ధృతి మాత్రం తగ్గడం లేదు.

పరిస్ధితి విషమిస్తే భారత్‌లో చోటు చేసుకునే విషాదాలు ఊహాకు కూడా అందవని ప్రపంచ ఆరోగ్య సంస్థ సహా పలువురు నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో ఇండియాకు ఆపన్న హస్తం అందించేందుకు అంతర్జాతీయ సమాజం ముందుకు వస్తోంది.

ఆక్సిజన్, వెంటిలేటర్లు ఇతర అవసరమైన సామాగ్రిని ఆయా దేశాలు యుద్ధ ప్రాతిపదికన పంపుతున్నాయి.నిన్నటి వరకు భీష్మించుకుని కూర్చొన్న అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సైతం మనసు మార్చుకుని భారత్‌కు బాసటగా నిలిచారు.

తాజాగా అమెరికాలోని దిగ్గజ కంపెనీలు సైతం ఇండియాకు సాయం చేసేందుకు ఏకతాటిపైకి వచ్చాయి.ప్రపంచస్థాయిలో పేరెన్నికగన్న 40 కంపెనీలు ఓ టాస్క్‌ఫోర్స్‌గా ఏర్పడి భారత్‌కు ఎలా సాయం చేయాలన్న దానిపై నిర్ణయం తీసుకున్నాయి.

యూఎస్ ఇండియా బిజినెస్ కౌన్సిల్ ఆఫ్ యూఎస్ ఛాంబర్ ఆఫ్ కామర్స్, యూఎస్ ఇండియా స్ట్రాటజిక్ అండ్ పార్ట్‌నర్‌షిప్ ఫోరం, బిజినెస్ రౌండ్ టేబుల్ వంటి వాణిజ్య సంఘాలు ఈ మొత్తం వ్యవహారాన్ని పర్యవేక్షిస్తున్నాయి.దీనిలో భాగంగా వచ్చే కొన్ని వారాల్లో దాదాపు 20 వేల ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను భారత్‌కు పంపుతామని తెలిపారు.

వీటితో పాటు వైద్య పరికరాలు, వ్యాక్సిన్లు, ఆక్సిజన్ సహా ఇతర సామాగ్రిని పంపుతామని టాస్క్‌ఫోర్స్ వెల్లడించింది.ఓ దేశం కోసం కార్పోరేట్ సంస్థలు ఓ టాస్క్‌ఫోర్స్‌గా ఏర్పడటం ఇదే తొలిసారని.

ఒక్క భారత్ విషయంలోనే ఇది జరిగిందని అమెరికా విదేశాంగ మంత్రి టోనీ బ్లింకెన్ అభిప్రాయపడ్డారు.ఈ టాస్క్‌ఫోర్స్‌లో ఈ కామర్స్, రిటైల్, ఫార్మా, టెక్, తమారీ రంగాల పరిశ్రమలు పాలు పంచుకుంటున్నాయి.

ఈ టాస్క్‌ఫోర్స్ ప్రతినిధులు.అమెరికాలోని భారత రాయబారి తరంజిత్ సింగ్ సంధుతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నారు.

కాగా, భారత్‌ను ఆదుకునేందుకు గూగుల్, మైక్రోసాఫ్ట్ సీఈవోలు సత్యనాదెళ్ల, సుందర్ పిచాయ్‌లు సాయం ప్రకటించిన సంగతి తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube