వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సరికొత్త ట్విస్ట్ ఇచ్చిన సీబీఐ..!!

సరిగ్గా 2019 ఎన్నికల ప్రచారానికి ముందు సీఎం జగన్ బాబాయి దివంగత వైయస్ సోదరుడు వైయస్ వివేకానంద రెడ్డి హత్య చేయబడ్డ సంగతి తెలిసిందే.టీడీపీ హయాంలో ఈ హత్య జరగటంతో అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ .

 Cbi Takes Ys Vivekananda Reddy Former Driver Dastagiri Into Custody For Investig-TeluguStop.com

టీడీపీ పార్టీపై తీవ్రస్థాయిలో విమర్శలు ఆరోపణలు చేసింది.ఇక టీడీపీ నేతలు కూడా కావాలని జగన్.

వైయస్ వివేకానంద రెడ్డి ని హతమార్చాడు అని ఆరోపణలు చేశారు.ఇదిలా ఉంటే వైయస్ వివేకా కూతురు డాక్టర్ సునీత తన తండ్రి హత్య కేసుకు సంబంధించి న్యాయపోరాటం చేసి సీబీఐ విచారణ కోరటంతో హైకోర్టు.

ఈ కేసును సీబీఐకి అప్పగించటం తెలిసిందే.

ఇదిలా ఉంటే ఇప్పటికే రెండుసార్లు సీబీఐ ఈ హత్యకు సంబంధించి అనుమానితులను విచారణ చేయటం జరిగింది.

రెండు సార్లు కూడా పెద్దగా కేసుకు సంబంధించి పురోగతి సాధించలేకపోయారు.పరిస్థితి ఇలా ఉండగా.వివేకా కూతురు డాక్టర్ సునీత.తన తండ్రి హత్య చేయబడి రెండు సంవత్సరాలు అయినా కేసును సిబిఐ చేధించలేక పోవడంతో ఇటీవల తీవ్ర స్థాయిలో విమర్శలు చేయడం జరిగింది.

మరోపక్క తిరుపతి ఉప ఎన్నికల నేపథ్యంలో ప్రతిపక్షాలు కూడా వైయస్ వివేకానంద రెడ్డి హత్య ను టార్గెట్ చేసుకుని ఆరోపణలు చేస్తూ ఉన్నారు.దీంతో మూడో సారి రంగంలోకి దిగి విచారణ స్టార్ట్ చేసిన సీబీఐ తాజాగా సరికొత్త ట్విస్ట్ ఇచ్చింది.

మేటర్ లోకి వెళ్తే వైయస్ వివేకానంద రెడ్డి.మాజీ డ్రైవర్ దస్తగిరిని ఈరోజు సీబీఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.

అతన్ని ఢిల్లీ తీసుకెళ్లి విచారిస్తున్నారు.అంతకుముందే దస్తగిరి తల్లిదండ్రులను పులివెందులలో విచారించడం జరిగింది.

దీంతో ఇప్పుడు దస్తగిరిని లోతైన విచారణ నిమిత్తం సిబిఐ బృందాలు ఢిల్లీ తీసుకెళ్లడం జరిగింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube