మద్యం మత్తులో నిర్లక్ష్యంగా ట్రక్కు నడిపి నలుగురు పోలీస్ అధికారుల మరణానికి కారణమైన భారత సంతతికి చెందిన డ్రైవర్‌కు ఆస్ట్రేలియా కోర్టు 22 ఏళ్ల జైలు శిక్ష విధించింది.సరిగ్గా ఏడాది క్రితం జరిగిన ఈ సంఘటన అప్పట్లో సంచలనం కలిగించింది.వివరాల్లోకి వెళితే.మోహిందర్ సింగ్ (48) మెల్బోర్న్ నగరంలో ట్రక్కు డ్రైవర్‌గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు.ఈ క్రమంలో 2020 ఏప్రిల్ 22న పీకలదాకా మద్యం తాగిన మోహిందర్.మత్తులోనే తన ట్రక్కు నడుపుకుంటూ ఈస్టర్న్ ఫ్రీవేపై తనిఖీలు నిర్వహిస్తున్న పోలీస్ వాహనాన్ని బలంగా ఢీకొట్టాడు.
దీంతో ఆ వాహనంలో ఉన్న నలుగురు పోలీస్ అధికారులు లినెట్ టేలర్, కెవిన్ కింగ్, గ్లెన్ హంఫ్రిస్, జోష్ ప్రెస్ట్నీ అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు.అనంతరం పోలీసులు మోహిందర్‌ను అదుపులోకి తీసుకున్నారు.
దీనిపై సుదీర్ఘ విచారణ జరిపిన పోలీసులు బుధవారం విక్టోరియా సుప్రీంకోర్టు ఎదుట హాజరుపరిచారు.అతనిపై నిర్లక్ష్య డ్రైవింగ్, మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, డ్రగ్స్ సేవించడం వంటి అభియోగాలు మోపారు.
మోహిందర్ మాదక ద్రవ్యాలు సేవించడం వల్ల అలసటకు గురయ్యాడని.ఏప్రిల్ 22న ఫ్రీవేలోని ఎమర్జెన్సీ రహదారిపై ఘటన జరగడానికి ముందు మాదక ద్రవ్యాలకు సంబంధించిన పనిలోనే వున్నాడని ఆస్ట్రేలియాకు చెందిన ఓ ప్రముఖ వార్తా పత్రిక కథనాన్ని ప్రచురించింది.
ఈ సంఘటన సమాజాన్ని షాక్‌కు గురి చేసిందని విచారణ సందర్భంగా న్యాయమూర్తి జస్టిస్ పాల్ కోగ్లాన్ అన్నారు.బాధితుల కుటుంబసభ్యులకు ఈ ఘటన తీరని దు:ఖాన్ని మిగిల్చిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రమాదానికి ముందు మోహిందర్.ఎమర్జెన్సీ లైన్లోకి వచ్చేందుకు పదే పదే ప్రయత్నిస్తున్న ఫుటేజ్‌ని సీసీ కెమెరాల నుంచి సేకరించిన పోలీసులు న్యాయస్థానానికి సమర్పించారు.ఆ సమయంలో అతని వేగాన్ని చూసిన కొందరు వాహనదారులు మోహందర్ తప్పకుండా ఎవరో ఒకరిని చంపేస్తాడని తాము భావించామని.సాక్ష్యం చెప్పారు.కాగా ఒక డ్రైవర్‌గా అతను ఎలాంటి నిబంధనలు పాటించలేదని దర్యాప్తు అధికారులు తెలిపారు.ప్రమాదానికి 72 గంటల ముందు కేవలం 5 గంటలు మాత్రమే మోహిందర్ విశ్రాంతి తీసుకున్నట్లు వెల్లడించారు.
ఆ మూడు రోజులలో ఎక్కువ భాగం డ్రైవింగ్ చేసిన అతను మాదక ద్రవ్యాలను వినియోగించినట్లు దర్యాప్తులో తేలింది.ఈ విషాదం, పోలీసులు విధి నిర్వహణలో ఎదుర్కొనే ప్రమాదాలను నిరంతరం గుర్తుచేస్తుందని నగర పోలీస్ కమీషనర్ వ్యాఖ్యానించారు.