సాధారణంగా మనలో చాలామంది మరణించిన వారిని దేవుళ్లతో సమానంగా భావిస్తుంటారు.ఆ విధంగానే వారికి ప్రతి రోజు పువ్వులు పెట్టడం, దీపం వెలిగించడం పూజ చేయడం వంటివి చేస్తుంటారు.
మరికొందరు చనిపోయిన మన పూర్వీకులకు గౌరవం ఇస్తూ, అలాగే వారి పై ఉన్న ప్రేమతో వారి ఫోటోలను దేవుడి గదిలో ఉంచుకొని దేవుడితో పాటు సమానంగా పూజలు చేస్తుంటారు.అయితే ఈ విధంగా పూజలు చేయడం సరికాదని, వెంటనే దేవుడి గదిలో చనిపోయిన వారి ఫోటోలు ఉంటే తీసేయమని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.
మన పూర్వీకుల పై లేదా మన కుటుంబ సభ్యుల పై ఎంతో ప్రేమగా మనం వారి ఫోటోలను దేవుడి గదిలో ఉంచి పూజించడం వల్ల అవి మన దృష్టిని, ఆలోచనలను పక్కకు మరల్చడమే కాకుండా, వారితో మనకున్న జ్ఞాపకాలను గుర్తు చేస్తూ బాధ పెడతాయనీ వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.అందుకోసమే చనిపోయిన వారి ఫోటోలను దేవుడి గదిలో ఉంచకూడదు.
ఈ విధంగా చనిపోయిన వారి ఫోటోలను హాల్లో ఎత్తయిన ప్రదేశంలో ఉంచుకోవాలని చెబుతున్నారు.
అదే విధంగా పూజ గదిలో గంటను ఏర్పాటు చేయడం సరికాదు, పూజ గది అనేది మన వ్యక్తిగత ధ్యానం కోసం మాత్రమే ఏర్పాటు చేసుకున్నది, కాబట్టి పూజ గదిలో గంటను ఏర్పాటు చేయకూడదు.అదే విధంగా పూజ గదిలో డబ్బులు, విలువైన వస్తువులను దాచి ఉంచడం సరికాదు.పూజగదికి ఎల్లప్పుడు రెండు తలుపులు, గడప తప్పనిసరిగా ఉండాలని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.
అదే విధంగా పూజ గదికి లేత రంగులే వేయాలి.అదేవిధంగా పూజ గది పైకప్పు ఎల్లప్పుడూ చాలా తక్కువ ఎత్తులో ఉండే విధంగా చూసుకోవాలి.
ఈ విధంగా వాస్తు శాస్త్రం ప్రకారం మన పూజగది ఏర్పాటు చేసుకోవడం ద్వారా ఆ ఇంట్లో ఎల్లప్పుడు ప్రతికూల వాతావరణం ఏర్పడుతుందని చెప్పవచ్చు.
DEVOTIONAL