ఒక గ్లాస్ టమాటా జ్యూస్ తాగితే.. ఇన్ని లాభాలు ఉన్నాయా?

టమాటాలు.వీటి గురించి ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు.

ఎర్ర‌గా నిగ‌నిగ‌లాడుతూ క‌నిపించే ట‌మాటాల‌ను ప్ర‌తి ఇంట్లోనూ విరి విరిగా వినియోగిస్తుంటారు.

ట‌మాటాల రుచి కాస్త పుల్ల‌గా ఉన్నా.

వాటిలో పోష‌కాలు బోలెడ‌న్ని ఉంటాయి.అందుకే ఆరోగ్య ప‌రంగానూ మ‌రియు సౌంద‌ర్య ప‌రంగానూ ట‌మాటాలు ఎన్నో ప్ర‌యోజ‌నాలు చేకూరుస్తారు.

అయితే కూర లేదా వేరే వేరే విధంగా కాకుండా.ట‌మాటాల‌ను జ్యూస్ రూపంలో తీసుకుంటే మ‌రిన్ని ప్ర‌యోజ‌నాలు పొందొచ్చని అంటున్నారు ఆరోగ్య నిపుణులు.

Advertisement

ముఖ్యంగా త‌ర‌చూ డీహైడ్రేష‌న్ స‌మ‌స్య‌తో బాధ ప‌డే వారు.రెగ్యుల‌ర్‌గా ఒక గ్లాస్ చ‌ప్పున ట‌మాటా జ్యూస్ తీసుకుంటే మంచిది.

ఎందుకంటే, శ‌రీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచే గుణాలు ట‌మాటా జ్యూస్ పుష్క‌లంగా ఉంటాయి.అలాగే ట‌మాటా జ్యూస్‌లో ఫైబ‌ర్, వాట‌ర్ ఎక్కువ‌గా ఉంటాయి.

కొవ్వు, కేల‌రీలు త‌క్కువ‌గా ఉంటాయి.అందువ‌ల్ల‌, వెయిట్ లాస్ అవ్వాల‌ని ప్ర‌య‌త్నించే వారు.

రోజుకో గ్లాస్ ట‌మాటా జ్యూస్ తీసుకుంటే వేగంగా బ‌రువు త‌గ్గొచ్చు.

మిల్క్ పౌడర్‌లో వైన్ కలిపిన అమ్మమ్మ.. కోమాలోకి వెళ్లిపోయిన పిల్లోడు..??
ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?

ట‌మాటా జ్యూస్ తీసుకోవ‌డం వ‌ల్ల.అందులో ఉండే పొటాషియం, విటమిన్ సి, కోలిన్ వంటి పోష‌కాలు ర‌క్తంలో బ్యాడ్ కొలెస్ట్రాల్‌ను క‌రిగించేస్తాయి.మ‌రియు ర‌క్తం గ‌డ్డ క‌ట్ట‌కుండా తోడ్ప‌డుతుంది.దాంతో గుండె జ‌బ్బులు ద‌రి చేర‌కుండా ఉంటాయి.

Advertisement

అలాగే కంటి చూపు లోపిస్తున్న వారు.ప్ర‌తి రోజు ట‌మాటా జ్యూస్ తాగితే చాలా మంచిది.

ఎందుకంటే, విట‌మిన్ ఎ పుష్క‌లంగా ఉండే ట‌మాటా జ్యూస్ కంటి ఆరోగ్యాన్ని మెరుగుప‌రుస్తుంది.క్యాన్సర్ వంటి ప్రాణాంత‌క వ్యాధి ద‌రి చేర‌కుండా కూడా ట‌మాటా జ్యూస్ స‌హాయ‌ప‌డుతుంది.

ఇక‌ ట‌మాటా జ్యూస్ తీసుకోవ‌డం వ‌ల్ల చ‌ర్మానికి కూడా చాలా మంచిది.ముఖ్యంగా మొటిమ‌లు, ముడ‌త‌లు, పొడి బార‌డం వంటి స‌మ‌స్య‌లు రాకుండా అడ్డుక‌ట్ట వేస్తుంది.

మ‌రియు చ‌ర్మాన్ని ఎల్ల‌ప్పుడు య‌వ్వ‌నంగా ఉండేలా చేస్తుంది.

తాజా వార్తలు