ఓ రైతన్న గోస.. ఇదేనా బంగారు తెలంగాణా.. !?

రైతు కంట కన్నీరు దేశానికి మంచిది కాదని ఎందరో గళమెత్తుతున్న, ఆ రైతుకు మాత్రం ఎప్పుడు కష్టాలే.నిత్య శ్రామికుడైనా కర్షకుడు శ్రమకు తగ్గట్టుగా ఫలితాన్ని అనుభవిస్తున్నాడా? అంటే అదీ లేదు.అన్ని చోట్ల అన్యాయం అవుతున్న వాడు రైతన్న మాత్రమే.ప్రస్తుత కాలంలో జై జవాన్.జై కిసాన్ అన్న నినాదాలు చెప్పడానికి మాత్రమే పనికి వస్తున్నాయి గానీ పసలేని పదాలుగా మిగిలిపోతున్నాయి.

 The Hardships Of The Farmers In Bangaru Telangana, Telangana, Mulugu, Hardships,-TeluguStop.com

ఇకపోతే ఈ బంగారు తెలంగాణాలో ప్రజల బ్రతుకులు రజాకార్ల వ్యవస్దను తలపిస్తున్నాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయట.

ఈ సమయంలో ఒక పేద రైతు పడ్ద కష్టం ఈ విమర్శలకు ఆయువునిస్తున్నాయట.

ఇకపోతే ములుగు జిల్లా, వెంకట పూర్ మండలం కేశవపుర్ గ్రామానికి చెందిన ఎండీ రాజసహెబ్ అనే వ్యక్తి 30 గుంటల భూమిని, అక్రమంగా అదే గ్రామనికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు తన భార్య పేరు మీద పట్టా చేసుకోవడంతో, తన భూమిని తనకు ఇప్పించాలని కార్యలయల చూట్టు తిరిగి చివరగా న్యాయం కోసం జిల్లా కలెక్టర్ కార్యాలయ గేటు ముందు అడ్డంగా పడుకోని నిరసన తెలుపుతున్నాడు.

కాగా ఈ రైతు సుమారు 30 నిమిషాల పాటు గేటుకు అండ్డంగా పడుకున్నా ఏ ఒక్క అధికారి ఇతని గోస పట్టించుకున్న పాపాన పోలేదట.మరి ప్రత్యేక తెలంగాణ పోరాడి సాధించుకున్నందుకు వచ్చే ఫలితాలు ఇవేనా అని ప్రశ్నిస్తున్నారట సామాన్యులు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube